ప్రభుత్వానిది మొండివైఖరి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానిది మొండివైఖరి

Aug 22 2026 1:35 AM | Updated on Aug 22 2026 1:35 AM

కూటమి ప్రభుత్వానిది మొండివైఖరి. ప్రజా సమస్యలు పట్టవు. నిరంకుశత్వంతోనే ఉంటుంది. రైతులు అంటే అసలు గిట్టదు.ఉత్తరాంధ్రలో ప్రసిద్దిచెందిన ఒకే ఒక్క చెరకు ఫ్యాక్టరీ సంకలి వద్ద ఉన్న ఈఐడీ ఫ్యారీ చక్కెర ఫ్యాక్టరీ. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎలాగోలా నెట్టుకొచ్చాం. ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి రైతులకు మద్దతుధర, ఎరువులు పంపిణీ చేయించాం. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఫ్యాక్టరీకి ప్రభుత్వ ప్రోత్సాహం లేదు. తగినంత ముడిసరుకు రాకపోవడం, యంత్రాలు పాతవి కావడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం క్రషింగ్‌ తగ్గించుకుంది. ఈవిషయాన్ని మండలిలో చెప్పాను. మీడియా ద్వారా ప్రభుత్వానికి సూచించాం. కానీ ఏమీ పట్టనట్లు వ్యవహరించడంతో చివరకు ఫ్యాక్టరీ మూతవేసే పరిస్థితి వచ్చింది.

పాలవలస విక్రాంత్‌, ఎమ్మెల్సీ, పాలకొండ

ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది

ఈ ఏడాది సుగర్‌ ఫ్యాక్టరీ ద్వారా క్రషింగ్‌ ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఉండదు. తగినంత ముడిసరుకు రావడంలేదు. ఫ్యాక్టరీ మెయింటనెన్స్‌కు అవసరమైన క్రషింగ్‌ జరగడంలేదు. ఫ్యాక్టరీ నష్టాలో నడుస్తోంది. యాజమాన్యం నిర్ణయం పాటించాల్సిందే.

జయవెంకట సూర్య.టి. సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌, ఈఐడీ ప్యారీ సుగర్స్‌,

సంకిలి, రేగిడి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement