కన్నేసి..కాజేశాడు | - | Sakshi
Sakshi News home page

కన్నేసి..కాజేశాడు

Aug 20 2026 3:46 AM | Updated on Aug 20 2026 3:46 AM

కన్నేసి..కాజేశాడు

పార్వతీపురం రూరల్‌: బ్యాంకు నుంచి బయలుదేరిన క్షణం నుంచే ఆ దంపతులపై కన్నేసిన ఓ దుండగుడు..అదును చూసి వారి డబ్బు బ్యాగును కాజేశాడు. కను రెప్పపాటులో రెండున్నర లక్షల రూపాయలతో ఉడాయించాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మండలం లక్ష్మీపురానికి చెందిన దంపతులు మంగళవారం జిల్లా కేంద్రంలో గల ఓ బ్యాంకులో రూ.3.10 లక్షలు రుణం తీసుకున్నారు. అక్కడే వేరొకరికి ఉన్న రూ.60 వేల పాత అప్పును చెల్లించారు. మిగిలిన రూ.2.50 లక్షలను ఓ చిన్న బ్యాగులో భద్రపరుచుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి పయనమయ్యారు. మార్గమధ్యంలో పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఓ చిన్న పని నిమిత్తం ఆగారు. బ్యాంకు నుంచి వారిని గమనిస్తూ వెంబడించిన దుండగుడు.. వారు ఏమరుపాటుగా ఉన్న సమయాన్ని పసిగట్టాడు. ద్విచక్ర వాహనంపై హఠాత్తుగా దూసుకొచ్చి ఆ నగదు బ్యాగును లాక్కుని పరారయ్యాడు. పదిలమనుకున్న డబ్బులు కళ్లెదుటే మాయమవడంతో కంగుతిన్న బాధిత దంపతులు లబోదిబోమంటూ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరాల్లో అనుమానితుడి దృశ్యాలు సేకరించారు.

● రూ.2.50 లక్షలు అపహరించిన దుండగుడు

● ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద దంపతుల ఏమరుపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement