అప్పులతోనే నెట్టుకొస్తున్నాం.. | - | Sakshi
Sakshi News home page

అప్పులతోనే నెట్టుకొస్తున్నాం..

Aug 14 2026 7:38 AM | Updated on Aug 14 2026 7:38 AM

అప్పులతోనే నెట్టుకొస్తున్నాం..

పాలకొండకు చెందిన ఈ చిత్రంలోని వ్యక్తి పేరు టేకి రామకృష్ణ. స్వర్ణకారుడు. తరతరాలుగా కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. గతంతో పోల్చుకుంటే వృత్తి పనులు లేక, ఆదాయం తగ్గడం.. ఖర్చులు పెరగడంతో రుణాల మీద ఆధార పడుతున్నట్లు చెబుతున్నాడు. ‘అద్దె దుకాణాలకు బాడుగలు చెల్లించలేకపోతున్నాం. పనులకు అవసరమైన మదుపుల కోసం బ్యాంకుల్లో చేసిన రుణాలు తీర్చడానికే వచ్చిన మొత్తమంతా సరిపోతోంది. దీనికి తోడు వడ్డీల భారం అదనం. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వృత్తుల నిర్వహణకు అవసరమైన మదుపులు భారంగా మారాయి. గత ప్రభుత్వంలో పలు సంక్షేమ పథకాల ద్వారా ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం కులవృత్తి అంతంతమాత్రంగానే ఉండడం వల్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. బంగారు ఆభరణాలకు సంబంధించిన పనులు లేక, రాగి లోహపు పనులు చేస్తున్నాం. బంగారం ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో చిన్నపాటి పనులకు ఎవరూ రావడం లేదు. చేతిలో డబ్బులు లేనప్పుడు అప్పు చేయడం.. ఉన్నప్పుడు వాటిని తీర్చేయడమే అనివార్యమైంది. పొదుపు ఊసే ఉండడం లేద’ని ఆయన అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement