ఉద్యమ స్ఫూర్తిని అందుకోవాలి..
డీఎస్సీ దగాపై
పార్వతీపురం వైఎస్సార్ కూడలిలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న యువతకు సంఘీభావం తెలుపుతూ నినదిస్తున్న మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు
డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై చంద్రబాబు సర్కారును నిలదీస్తూ నిరుద్యోగులు కదంతొక్కారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో సమరశంఖం పూరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో గురువారం రిలే నిరాహార దీక్షలు ఆరంభించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రదాన్ రాజీనామా చేశారని, రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలకు నారా లోకేశ్ బాధ్యత వహించా లని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ, నియామకాల్లో అవకతవకల వల్ల వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు తారుమారయ్యాయని, ఎంత కష్టపడి చదివి నా నిరుద్యోగులుగా మిగిలిపోయామని వాపోయా రు. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల నిరుద్యోగులకు కష్టాలు తప్పడంలేదన్నారు. జాబ్ క్యాలెండర్ లేదని, ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగులకు నెలకు ఇస్తామన్న రూ.3వేలు భృతిహామీ నెరవేర్చలేదని, విద్యార్థుల చదువులకు ఆధారమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో జాప్యం చేస్తున్నారని జెన్‌జీ యువత మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. చంద్రబాబు పాలన కు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రిలే నిరాహార దీక్షలకు కురుపాంలో మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, పాలకొండలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, సాలూరులో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సంఘీభావం తెలిపారు. కురుపాం దీక్షలో పుష్పశ్రీవాణి స్వయంగా పాల్గొన్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. నాలుగు రోజుల పాటు చేపట్టే రిలే నిరాహార దీక్షల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచించారు.
– సాక్షి, పార్వతీపురంమన్యం
యువత ఉద్యమ స్ఫూర్తిని అందుకోవాలి. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై నిలదీయాలి. నిరుద్యోగభృతి, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. డీఎస్సీ అవతవకలపై విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ నోరుమెదకపోవడం విచారకరణం. తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. అప్పటివరకు నిరుద్యోగుల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుంది. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిప్యూటీసీఎం


