ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఏర్పాట్లు

Aug 7 2026 1:44 AM | Updated on Aug 7 2026 1:44 AM

ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఏర్పాట్లు ● కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి

పార్వతీపురం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 8న ఉదయం 10 గంటలకు పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జిల్లా పరిపాలన యంత్రాంగం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షే మ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతి థిగా హజరవుతారన్నారు. గిరిజన కళా, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని గిరిజనులు, స్వయం సహా యక సంఘాల మహిళలు, వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రా ల సభ్యులు, యువత, రైతులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ ఆర్‌.వైశాలి తదితరులు పాల్గొన్నారు.

పనుల్లో నాణ్యతలో రాజీ వద్దు

జిల్లాలో నిర్మాణంలో ఉన్న పాఠశాలలు, సంక్షేమ వసతి గృహల పనులను జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ పదొద్దని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరె డ్డి అధికారులను ఆదేశించారు. ఏపీ విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న భవనాల నిర్మాణ పురోగతిపై గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్ట ర్‌ సమీక్ష నిర్వహించారు. పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్‌, ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తర చూ తనిఖీలు నిర్వహించి నాణ్యతను నిర్ధారించాలని సూచించారు. సమావేశంలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పీఓలు ఆర్‌.వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఈఓ పి.బ్రహ్మజీరావు తదితరులు పాల్గొన్నారు.

8న భద్రగిరిలో 50 పడకల సీహెచ్‌సీ ప్రారంభం

భద్రగిరిలో నాబార్డ్‌ నిధులు రూ.8,95 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)ని ఈనెల 8న ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్లను అన్ని శాఖలు సమన్వయంతో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement