పాలకొండ రూరల్: కొద్ది రోజులుగా అన్నదాతలు వరుణుడి కరుణ కోసం ఎంతో ఆశగా ఎదు రు చూస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం మండల వ్యాప్తంగా భారీ వర్షం దాదాపుగా రెండు గంటలపైబడి కురిసింది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే వరి భూముల్లో సాగునీరు లేక తీవ్ర ఎండలకు నష్టపోతున్న పంటకు ఈ వర్షం జీవం పోషింద ని కర్షకులు పేర్కొంటున్నారు.తాజా తడులతో తమ పంటలకు ఎరువులు, క్రిమిసంహార మందులు అందించేందుకు వెసులుబాటు కలిగిన ట్లు చెబుతున్నారు. మరోవైపు ఎరువుల వాడకంలో అవసరమైన సూచనలతో మందులు వేయాలని మండల వ్యవసాయాధికారి వరప్రసాద్ సూచించారు. ముదురు నారు వేసేందు కు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షంతో పట్టణంలో రహదారులు జలమయమయ్యాయి. వార్డుల్లో పలు చోట్ల కాలువలు సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు, మురుగు రోడ్లపైకి చేరింది.
భామిని: ఏనుగుల దాడిలో ఆస్తులు కోల్పోయిన బాధితులందరికీ తగిన పరిహారం అందించనున్నట్లు జిల్లా అటవీశాఖాదికారి జీఏపీ ప్రసూన గురువారం తెలిపారు. ఈ మేరకు భామిని మండలం పాలవలస గిరిజన గ్రామంలో నాలుగు ఏనుగుల దాడిలో సర్వం కోల్పోయిన గిరిజన బాధితులను ఆమె కలిసి ఓదార్చారు. నష్టాలనుంచి బయట పడడానికి నింబంధనల మేరకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తమ గ్రామంలో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు తరలింపుపై బాధిత గిరిజనులు ఆమెకు మొర పెట్టుకున్నారు. తమ ప్రాణాలకు ఎప్పుడైనా ముప్పు వాటిల్లుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎఫ్‌ఓ ప్రసూన వెంట సబ్ డీఎఫ్‌ఓ సంజయ్ ఎల్లా, ఎఫ్‌ఆర్‌ఓ మణికంఠేష్, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణ, ఎఫ్‌బీఓ కేశవరావు, ట్రాకర్స్ ఉన్నారు.
సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ
సాలూరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ సెప్టెంబర్ 1న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని సీపీఐ నాయకులు కోరారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం నుంచి ఈ నెల 15 వరకు దేశ వ్యాప్తంగా జరుగతున్న ప్రజా చైతన్య పాదయాత్రలను నియోజకవర్గ కేంద్రంలో ఆ పార్టీ కార్యదర్శి బలగ రాధానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు.


