గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
రైతు ఆనందమే.. అందరి సంతోషం
జిల్లాలో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఏనుగుల బారినపడి 13 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఎకరాల్లో రైతులు పంటలను కోల్పోయారు. కుంకీలు తెస్తామని.. ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపుతామని గత ఏడాదంతా పాలకులు హామీలిస్తూనే గడిపేశారు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో అంటున్నారు. ఈ సారైనా ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం.
పార్వతీపురం: పీఆర్‌టీయూ రాష్ట్ర క్యాలెండర్ ను కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి బుధవారం కలెక్టర్ కార్యాలయ చాంబర్‌లో ఆవిష్కరించా రు. అనంతరం పీఆర్‌టీయూ నాయకులు కలె క్టర్‌కు ముందస్తుగా నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాల సాధనకు ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో కృషిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు వి.తవిటినాయు డు, కె.విజయ్, ఎ.సూర్యనారాయణ, టి.తాతబాబు, జి.శశికుమార్, రామినాయుడు పాల్గొన్నారు.
పాలకొండ: మండలంలోని నాగావళి నదితీరంలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపులపై బుధవా రం తెల్లారుజామున అధికారులు దాడులు నిర్వహించారు. సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్, డీఎస్పీ ఎం.రాంబాబు తొలుత అంపిలి గ్రా మం వద్ద ఉన్న ఇసుక ర్యాంపును తనిఖీ చేశా రు. నాటుబళ్లతో ఇసుక తరలిస్తున్న వారితో మాట్లాడారు. అనంతరం నదీ తీరంలో తనిఖీలు చేపట్టారు. మండలంలో అట్టలి సమీపంలో అక్రమంగా కంకర తరలిస్తున్న రెండు లారీలను గుర్తించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నదీతీర గ్రామాల్లో ఉన్న ఇసుక ర్యాంపులపై నిఘా ఏర్పాటు చేశామన్నారు.
గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి వేంకటేశ్వర స్వామి హుండీల ఆదాయం రూ. 9,45,439 వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. దీనిలో కోదండ రామాలయం నుంచి రూ.23,229 సమకూరినట్లు వివరించారు. దేవదాయశాఖ పాలకొండ డివిజన్ సీఐ ఎస్.రామారావు పర్యవేక్షణలో బుధవారం హుండీల ఆదాయం లెక్కించామని చెప్పారు. 2025 అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలు లెక్కించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు, అర్చకుడు అప్పలాచార్యులు, టీటీడీఎస్‌టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం:
కాలగమనం గిర్రున తిరిగింది.. మరో ఏడాదిని తనలో కలిపేసుకొంది. మదిలో జ్ఞాపకాల దొంతరలను పదిలపరుచుకుంటూ 2025 కనుమరుగైంది. క్యాలెండర్‌లో చివరిపేజీ చిరిగిపోయింది. కొంగొత్త ఆకాంక్షలు.. కోటి ఆశలతో మరో నవ వసంతం మన ముందుకొచ్చింది. అలుపెరగని బా టసారిలా! గతమిచ్చిన విజయాలు సోపానాలుగా .. వైఫల్యాలు గుణపాఠాలుగా స్వీకరిద్దాం.. భవిత కు బంగారు బాటలు పరుస్తూ, లక్ష్యం దిశగా అడుగులు వేద్దాం.. నూతన సంవత్సరం 2026ను సరి కొత్తగా ప్రారంభిద్దాం... ఆనందంగా, సగర్వంగా!!
గతమిచ్చిన విజయాలు అక్కడితో ఆగిపోకూడదు. కొత్త సంవత్సరంలోనూ కొనసాగాలి. పదో తరగతి పరీక్షల్లో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలనం. వరుసగా మూడేళ్లు ప్రథమ స్థానంలో నిలిచింది. మన ప్రభుత్వ బడుల పిల్లలు భళా అనిపించుకున్నారు. అదే ఒరవడి కొనసాగించాలి. అంతకుమించిన ప్రణాళికలతో ముందుకు సాగాలి. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 187 ఉన్నాయి. పదో తరగతి విద్యార్థులు 9,149 మంది పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. 36 ప్రైవేట్‌పాఠశాలల్లో 1,700 మంది విద్యార్థులున్నారు. మరోసారి వీరంతాజయకేతనం ఎగురవేయాలి. విజయీభవ!
కలెక్టర్‌గా డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి.. జిల్లాలో వినూ త్న ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఆయన చేపట్టిన ‘ముస్తాబు’, ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా వీటిని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కురుపాం పచ్చకామెర్ల ఘటనలో వందలాదిమంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. జిల్లాలోని పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. పిట్టల్లా రాలిపోతున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు, క్రమశిక్షణ అలవాటు చేసేందుకు ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ చెబుతున్నారు. దీన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తూ.. పిల్లలు సంపూర్ణ ఆరోగ్యం సాధించేలా.. జ్వరాలు, మరణా లు తగ్గేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాల్సి ఉంది. పౌష్టికాహార లోపాన్ని నివారించాలి. పాఠశాలలు, వసతిగృహాల్లో మెనూను సక్రమంగా అందించాలి.
ఏళ్లు గడుస్తున్నా గిరిజనుల తలరాత మారడం లేదు. డోలీల మోతలు ఆగడం లేదు. అనారోగ్య సమస్య వచ్చినా, అత్యవసర పరిస్థితి ఎదురైనా డోలీల ద్వారానే కొండకోనలు దిగాలి. నదులు, వాగులు దాటాలి. మార్గమధ్యంలోనే ప్రసవాలు.. సకాలంలో వైద్యం అందక ఆగిపోయిన ప్రాణాలెన్నో. జిల్లాలోని 15 మండలాల్లోనూ పీహెచ్‌సీల్లో వైద్యం పడకేసింది. జ్వరాలు, ఇతర రోగాలతో సర్కారు వైద్యశాలలు కిటకిటలాడుతున్నాయి. సరైన వైద్యసదుపాయాలు పేదలకు అందడం లేదు. జిల్లా ఆస్పత్రి నుంచి రిఫరల్స్ పెరుగుతున్నాయి. మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరం, విశాఖ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పార్వతీపురం, సీతంపేటల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం ప్రారంభమయ్యాయి. దాదాపు 80 శాతానికిపైగా పనులు పూర్తయిన తర్వాత.. ప్రభుత్వం మారడంతో అవి కాస్త పడకేశాయి. ప్రభుత్వ వైద్యకళాశాల పూర్తిగా అటకెక్కింది. పీపీపీ విధానమంటూ చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లింది. దీంతో పేదలకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. కొత్త సంవత్సరంలోనైనా ఈ పరిస్థితి మారాలి. వైద్యం ప్రజల చేరువ కావాలి.
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అనేకం. వాటి బాగోగులను గతేడాదంతా పట్టించుకున్న దాఖ లాలు లేవు. తోటపల్లి.. నిర్వహణ లేక, శివారు భూములకు నీరివ్వలేకపోతోంది. తోటపల్లి ఎడమ ప్రధాన కాలువలకు 2008లో ఏర్పాటు చేసిన షట్టర్ల నిర్వహణను గాలికొదిలేశారు. కాలువ సామర్థ్యం 414 క్యూసెక్కులు. పట్టర్లు పాడవడంతో నీరు వృథాగా పోతోంది. జంఝావతి జంఝాటం అలానే ఉంది. ఒడిశాతో చర్చలు జరిపి, పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల ఇక్కడే ఈతకు దిగి, ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడిగెడ్డ నుంచి వట్టిగెడ్డ అనుసంధానం పనులు ముందుకు కదలలేదు. ఇది పూర్తయితే సుమారు 600 ఎకరాలకు నీరందుతుంది. మిగులు జలాలు వట్టిగెడ్డకు చేరుతాయి. కురుపాం మండలం గుమ్మిడిగెడ్డ జలాశయం ద్వారా 3,100 ఎకరాలకు సాగునీందించాల్సి ఉంది. మరమ్మతులు జరగకపోవడంతో ప్రస్తుతం 1,500 ఎకరాలకే అందుతోంది. వెంగళరాయ సాగర్, వట్టిగెడ్డ, పెద్దగెడ్డ, పెదంకాలం ఆనకట్ట ఆధునికీకరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉన్నచోట వంతెనల నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. వరదల సమయంలో ఆవల ఉన్న గ్రామాలకు బాహ్య ప్రపంచాలతో సంబంధాలు తెగిపోతున్నాయి. సాధారణ రోజుల్లోనూ పడవ ప్రయాణాలే దిక్కవుతున్నాయి. పాచిపెంట, కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం, సీతంపేట, భామిని, సాలూరు, సీతానగరం ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రవాహానికి బలైన ప్రాణాలు అనేకం ఉన్నాయి. పూర్ణపాడు–లాభేసు వంతెనకు చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గుంతలు లేని రహదారులంటూ గతేడాది మొదట్లో హడావిడి చేశారు. కొద్దిరోజులకే అవన్నీ రాళ్లు తేలాయి. జిల్లాలో ఏ మూల చూసినా రహ‘దారిద్య్రం’ కనిపిస్తోంది. ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించాలి.
జిల్లాలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కనీస మౌలిక సదుపాయాలు అందడం లేదు. పట్టణాలు, పల్లెలన్న తేడా లేకుండా ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. దాదాపు ఎనిమిది మండలాల్లో ఉన్న గిరిజనుల బాగోగులను పట్టించుకునే వారే కరవయ్యారు. గ్రామాలు అధ్వానంగా కనిపిస్తున్నాయి. తాగునీరు కూడా అందని పరిస్థితి నెలకొంది. గత వైఫల్యాలను మరిచిపోయి.. నూతన వసంతంలోనైనా కొత్తగా మొదలు పెట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
అన్నం పెట్టే రైతు బాగుంటేనే మనం బాగుంటాం. జిల్లాలో 3.34 లక్షల ఎకకరాల్లో సాగు భూమి ఉంది. ఇందులో 2.33 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను పండిస్తున్నారు. గత ఏడాదంతా అన్నదాత తీవ్ర క్షోభను ఎదుర్కొన్నాడు. ఖరీఫ్ సీజన్‌లో సకాలంలో ఎరువులు, విత్తనాలు, యూరియా అందక అవస్థలు పడ్డాడు. మధ్యలో అకాల వర్షాలు, తుపాన్లు ముంచాయి. చివర్లో వచ్చిన మోంథా తుపాను కారణంగా 732 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. పరిహారం ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు. పంట నష్టంలో నిబంధనలు శరాఘాతంగా మారాయి. అన్నదాత సుఖీభవ నిధులు పూర్తిస్థాయిలో అందలేదు. దీంతో పెట్టుబడికి నానాపాట్లు పడాల్సి వచ్చింది. రెక్కల కష్టంతో సేద్యం చేసినా.. చివరికి వచ్చేసరికి ధాన్యం విక్రయించుకోవడంలోనూ దగా పడుతున్నాడు. మిల్లర్ల దోపిడీకి బలవుతున్నాడు. మద్దతు ధర అందడం లేదు. రబీ సీజన్ మొదలైంది. అన్నదాత కష్టాలు యథావిధిగా కనిపిస్తున్నాయి. 2026లోనైనా రైతు కష్టం పోవాలి. ఆ విధంగా అధికార యంత్రాంగం ఆలోచన చేయాలి.
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026


