జనవరి 3 నుంచి తెలుగు మహాసభలు
రాజాం సిటీ: అమరావతిలో 2026 జనవరి 3, 4, 5వ తేదీల్లో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని యువ రచయితల వేదిక అధ్యక్షుడు, విశ్వసాహితీ కళావేదిక రాష్ట్ర యువజన అధ్యక్షుడు డాక్టర్ పెద్దింటి ముకుందరావు పిలుపునిచ్చారు. యువ రచయితల వేదిక ఆధ్వర్యంలో స్థానిక చీపురుపల్లి రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద మహాసభల వాల్‌పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ స్థాపించిన ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈ సభలు జరగనున్నాయని చెప్పారు. తెలుగుభాష పరిరక్షణ, తెలుగు భాష భవిష్యత్ కోసం ఈ మహాసభలకు తెలుగువారంతా హాజరుకావాలని కోరారు. భాష బతకాలంటే పిల్లలు, యువత భాషపై మక్కువ పెంచుకోవాలని అన్నారు. రెడ్‌క్రాస్ సభ్యులు కొత్తా సాయిప్రశాంత్‌కుమార్, పెంకి చైతన్యకుమార్, మరిశర్ల గంగారావు, ఉల్లాకుల నీలకంఠేశ్వరయాదవ్, కరణం శంకరరావు, చీమకుర్తి ప్రసాద్, కోట తిరుపతిరావు, రెడ్డి శ్రీనివాసరావు, వి.సుబ్బారావు, రెడ్డి కాశీనాయుడు, బొంతు సూర్యనారాయణ పాల్గొన్నారు.


