చలి..చలి... | - | Sakshi
Sakshi News home page

చలి..చలి...

Nov 24 2025 7:46 AM | Updated on Nov 24 2025 7:46 AM

చలి..

చలి..చలి...

అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తలు తప్పనిసరి..

ప్రమాదాలకు ఆస్కారం

శుభ్రత.. పరిశుభ్రత పాటించాలి

చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరూ శ్రద్ధ చూపాలి. మంచులో ఎక్కువగా తిరగకూడదు. వీలైనంత మేరకు కాచి వడపోసిన నీటిని తాగాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వేడి, వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలి. నిల్వ ఆహారం తీసుకోకూడదు. జాగ్రత్త వహించకపోతే ఇబ్బందులు తప్పవు. చర్మం పాడవకుండా కోల్డ్‌ క్రీమ్‌ వాడుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు మంకి క్యాప్‌లు వంటివి వాడాలి.

– కె.విజయపార్వతి, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఐటీడీఏ, సీతంపేట

పొగమంచు వల్ల జలుబు, జ్వరంతో పాటు న్యుమోనియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తులు, చర్మవ్యాధులు రావచ్చు. 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే రోగాలు వ్యాపిస్తాయి. ప్రతి ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆహార నియమాలు పాటించాలి.

– డా.ఎన్‌ఎంకె.తిరుమలప్రసాద్‌, వైద్యులు, పీహెచ్‌సీ, గరుగుబిల్లి

సీతంపేట/గరుగుబిల్లి: చలి కాలం ఈ ఏడాది కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా బాగానే ప్రభావం చూపిస్తోంది. ఏజెన్సీలో అయితే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఈ చలి కాలం వైరస్‌, బ్యార్టీరియా, ఫంగస్‌ వంటివి వ్యాప్తి చెందడానికి అనువైన సమయం. నూటికి 90 శాతం ఈ కాలంలోనే వ్యాధులు విజృంభిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు ఈ కాలంలోనే మరింత ఇబ్బందులకు గురవుతుంటారు. పగటి పూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా.. రాత్రి వేళల్లో చలి తీవ్రత ఆధికంగా ఉంటోంది. వేకువజామునే మంచుతో పాటు చలిగాలులు వీస్తున్నాయి. మిగిలిన కాలాలతో పోల్చకుంటే చలికాలంలో వాతావరణం ఆహ్లదంగా ఉండటమే కాకుండే వివిథ వ్యాధులు వ్యాప్తికి కారణమవుతుంది. కాగా జిల్లాలో ఉష్టోగ్రతలు రోజు రోజుకూ పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి. ప్రస్తుత శీతల వాతావరణంలో గాలి తుంపర్ల ద్వారా పోకే ప్రమాదకర అంటువ్యాధి స్వైన్‌ఫ్లూ. ఇది హెచ్‌వన్‌, ఎన్‌వన్‌ వైరస్‌ ద్వారా వస్తుంది. మనిషి నుంచి మనిషికి గాలి ద్వారా వ్యాపిస్తుంది. తరుచూ చేతులు కడుక్కొంటూ ఉండాలి. వేడి నీరు వాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

ఇంట్లో పెంపుడు జంతువులు ఉంచకూడదు...

వివిధ రకాల వైరస్‌ల జంతువులకు వ్యాపించే కాలం శీతాకాలం. అందుకు పెంపుడు జంతువులు ఉన్నవారు అతి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లోని వంటగదుల్లోకి, బెడ్‌రూంల్లోకి వాటిని రానివ్వక పోవడం ఎంతో శ్రేయస్కరం. పెంపుడు జంతువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. చిన్నారులకు వాటిని దూరంగా ఉంచడం మంచిది,

ఆస్తమా రోగులకు ఆపద కాలం

చలే కదా అని తేలిగ్గా తీసుకుంటే అది ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. చలితో ప్రధా నంగా వచ్చే వ్యాధి ఆస్తమా. ఆస్తమాతో బాధపడుతున్న రోగుల్లో చలి తీవ్రతతో బాధ మరింత పెరుగుతుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించే వారికి ఆస్తమా కొత్తగా వచ్చే అవకాశముంది. మధుమేహం, గుండె జబ్బులతో బాధపడే రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి. చలికి శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గిపోవడంతో రక్తనాళాల పరిమాణం తగ్గి గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి. రక్తనాళాలు చిన్నవిగా మారడంతో పక్షపాతం రావడంతో పాటు మెదడులో నాళాల్లో రక్తం గడ్డకట్టి రోగులు ఉన్న ఫలంగా మరణించవచ్చు.

పొగ తాగితే ఇబ్బందులే...

చలి కాలంలో పొగ తాగడం ద్వారా శరీరాన్ని వేడిగా ఉంచుకోవచ్చని చాలా మంది అనుకుంటుంటారు. అయితే ఈ కాలంలో పొగ తాగడం ఎంతో ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో పొగతాగే వారి నోట్లోకి 10 శాతం నికోటిన్‌ మాత్రమే వెళ్తుంది. మిగిలింది ఆక్సిజన్‌లో కలుస్తుంది. అయితే శీతాకాలంలో 90 శాతం నికోటిన్‌ నోట్లోకి వెళ్లి ఉపిరితిత్తులు వ్యాధికి గురి చేస్తుంది.

ఆహార జాగ్రత్తలు అవసరమే...

● శీతాకాలంలో సాధారణ రోజులకు భిన్నంగా ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా తీపి పదార్థాలు తినడం తగ్గించాలి. పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ● రోగ నిరోధక శక్తి క్షీణింపజేసేందుకు ఆహారం దోహదపడుతుంది. అందుకే ఈ కాలంలో జంక్‌ ఫుడ్స్‌ తగ్గించాలి. ఆహార పదార్థాలపై ఈగలు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటితో న్యూమోనియా, అస్తమా, హైపటైటీస్‌–బి వచ్చే అవకాశముంది.

ఏజెన్సీలో వణికిస్తున్న చలి పులి

పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఆహార జాగ్రత్తలు అవసరమే..

తెల్లవారుజామున తీవ్రంగా పొగ మంచు

ప్రమాదాలకు అవకాశలెక్కువ.. బీ అలెర్ట్‌...

ప్రస్తుతం చలితో పాటు మంచు ఎక్కువగా కురుస్తోంది. ఈ సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవు. తెల్లవారు జామున వాహనాలు నడిపేవారు నిద్ర మత్తులో ఉంటారు. వారికి ఎదురుగా ఉన్నది కనిపించకుంటే ప్రమాదాలకు దారి తీసే అవకాశముంది. పట్టణాలు, నగరాల్లో రోడ్లు వ్యాయామ కాలాలుగా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో రోడ్ల వెంట నడక, పరుగులు తీసేవారు ప్రమాదాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

చలి కాలంలో ఇంట్లో తేమ లేకుండా చూడాలి. చెత్త, చెదారం పనికిరాని వస్తువులు, అవసరం లేని సామగ్రి ఇంట్లో లేకుండా జాగ్రత్త పడాలి. వాటితో దోమలు, కీటకాలు ఇంట్లోకి చేరే వీలుంది. రోజు విడిచి రోజు స్నానపు గదులు, మరుగు దోడ్లు శుభ్రం చేసుకోవాలి. బ్లీచింగ్‌ పౌడరుతో నీటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి ఆవరణలో పూల కుండీల్లోని మొక్కలకు పురుగులు ఆశించే అవకాశాలెక్కువ. సాధ్యమైనంత వరకు మొక్కలు కత్తిరించాలి. అప్పుడే ఇబ్బందులు తప్పి అందంగానూ, ఆకర్షణీయంగా ఉంటాయి. ఆహార నియమాలు తప్పనిసరి

చలి..చలి... 1
1/3

చలి..చలి...

చలి..చలి... 2
2/3

చలి..చలి...

చలి..చలి... 3
3/3

చలి..చలి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement