సాక్షి ‘స్పెల్ బీ, మ్యాథ్స్ బీ’లకు విశేష స్పందన
విజయనగరం అర్బన్: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి డక్స్ వాఫీ సంస్థ, రాజమండ్రి ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అసోసియేట్ స్పాన్సర్‌గా ఆదివారం స్థానిక పెదతాడివాడలోని నేషనల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ‘సాక్షి స్పెల్‌బీ’ రెండో రౌండ్ (క్వార్టర్ ఫైనల్), ‘సాక్షి మ్యాథ్స్‌బీ’ సెమీఫైనల్ రౌండ్ పోటీలకు విశేష స్పందన లభించింది. పోటీలలో భాగంగా నాలుగు విభాగాల్లో స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీలలో విడివిడిగా విద్యార్థులు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ పోటీల విజేతలు త్వరలో విశాఖలో జరిగే డివిజన్ స్థాయి స్పెల్‌బీ (సెమీఫైనల్స్), మ్యాథ్స్‌బీ ఫైనల్స్ పోటీలలో పాల్గొంటారు. అక్కడి విజేతలకు నాల్గో రౌండ్‌గా నిర్వహించే ఫైనల్స్ మౌఖిక పరీక్ష జరుగుతాయి. జిల్లా స్థాయిలో జరిగిన ఈ పోటీలు విద్యార్థుల్లో పోటీస్ఫూర్తిని నింపాయి. సాక్షి శ్రీకాకుళం యూనిట్ మేనేజర్ బీజేజీవీఆర్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను పాఠశాల ప్రిన్సిపాల్ బి.రాజారావు ప్రారంభించారు. వివిధ కేటగిరిలలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి మూడు గంటల పాటు స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేటగిరి విద్యార్థులు మాట్లాడుతూ సాక్షి అందించిన ప్రిపరేషన్ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ప్రిన్సిపాల్ రాజారావు మాట్లాడుతూ ఈ పోటీలు విద్యార్థుల్లో ఇంగ్లీష్ స్పెల్లింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులపై పట్టు పెంచడమే కాక, ఆత్వవిశ్వాసాన్ని కలిగించడంలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పరీక్ష నిర్వహణలో పాఠశాల ఇన్‌చార్జ్ రమాదేవి, ఎగ్జామినేషన్ ఇన్‌చార్జ్ బెనర్జీ, పాఠశాల పుపాధ్యాయులు పాల్గొన్నారు.
సాక్షి ‘స్పెల్ బీ, మ్యాథ్స్ బీ’లకు విశేష స్పందన
సాక్షి ‘స్పెల్ బీ, మ్యాథ్స్ బీ’లకు విశేష స్పందన
సాక్షి ‘స్పెల్ బీ, మ్యాథ్స్ బీ’లకు విశేష స్పందన
సాక్షి ‘స్పెల్ బీ, మ్యాథ్స్ బీ’లకు విశేష స్పందన


