డిసెంబర్ 6 నుంచి ఉత్తరాంధ్ర వాలీబాల్ పోటీలు
బొబ్బిలి: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 69వ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 6 నుంచి రెండు రోజుల పాటు బొబ్బిలి సంస్థానం ఉన్నత పాఠశాల మైదానంలో వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్టు అంబేడ్కర్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సోరు సాంబయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండ గోపాలరావు తెలిపారు. శనివారం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన విలేకర్ల సమావేశంలో భాగంగా టోర్నమెంట్ విధి విధానాలుండే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా డిసెంబర్ 7న తాండ్ర పాపారాయ విగ్రహం వద్ద బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనే టీములు 9989232309, 9949613986 నంబర్లను సంప్రదించాలన్నారు.


