రసవత్తరంగా ఎస్‌జీఎఫ్ బాస్కెట్‌బాల్ పోటీలు
నూజివీడు: నూజివీడులో నిర్వహిస్తున్న ఎస్‌జీఎఫ్ బాలుర, బాలికల అండర్–17 రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి 13 బాలుర జట్లు, 13 బాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. శనివారం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గోపీమూర్తి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీలు లీగ దశను ముగించుకొని నాకౌట్ దశకు చేరుకున్నాయి. ఈ పోటీలు పలు జట్ల మధ్య హోరాహోరీగా సాగగా, మరొకొన్ని పోటీలు ఏకపక్షంగా సాగాయి. బాలికల విభాగంలో గుంటూరు జట్టు చిత్తూరుపై 19–8, పశ్చిమగోదావరి జట్టు విజయనగరంపై 38–0, తూర్పు గోదావరి జట్టు కర్నూల్‌పై 29–10, వైజాగ్ జట్టు అనంతపురంపై 21–13, వైఎస్సార్ కడప జట్టు నెల్లూరుపై 20–0, చిత్తూరు జట్టు విజయనగరంపై 26–2, గుంటూరు జట్టు పశ్చిమగోదావరిపై 36–24, కర్నూల్ జట్టు శ్రీకాకుళంపై 29–2, వైజాగ్ జట్టు ప్రకాశంపై 13–0, కృష్ణాజిల్లా జట్టు నెల్లూరుపై 19–0 తేడాతో గెలుపొందాయి. బాలుర విభాగంలో తూర్పు గోదావరి జట్టు వైజాగ్‌పై 50–32, చిత్తూరు జట్టు శ్రీకాకుళంపై 27–17. గుంటూరు జట్టు వైఎస్సార్ కడపపై 28–3, అనంతపురం జట్టు పశ్చిమగోదావరిపై 32–8, కృష్ణాజట్టు కర్నూలుపై 31–12, చిత్తూరు జట్టు తూర్పుగోదావరి జట్టుపై 30–21, వైజాగ్ జట్టు శ్రీకాకుళంపై 23–16, గుంటూరు జట్టు నెల్లూరుపై 29–12, అనంతపురం జట్టు విజయనగరంపై 29–0, కర్నూల్ జట్టు ప్రకాశంపై 17–02తేడాతో గెలుపొందాయి. దీంతో బాలికల విభాగంలో క్వార్టర్స్ ఫైనల్‌కు కృష్ణ, కర్నూలు, అనంతపురం, గుంటూరు, తూర్పుగోదావరి, కడప, చిత్తూరు, వైజాగ్ జట్లు చేరాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో కృష్ణా జట్టు కర్నూలుపై 26–12, తూర్పుగోదావరి జట్టు వైఎస్సార్ కడపపై 18–6తేడాతో, గుంటూరు జట్టు అనంతపురంపై 35–17, వైజాగ్ జట్టు చిత్తూరుపై 24–20 స్కోర్‌తో గెలుపొందాయి. దీంతో కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు, వైజాగ్ జట్లు సెమీస్‌కు చేరాయి. కార్యనిర్వాహక కార్యదర్శి వాకా నాగరాజు పోటీల నిర్వహణను పర్యవేక్షించారు.


