24న చలో కలెక్టరేట్
విజయనగరం గంటస్తంభం: పట్టణంలో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు ఉన్నచోటే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇల్లు లేని వారికి రెండు సెంట్లు భూమి కేటాయించాలని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఈ నెల 24న చలో కలెక్టరేట్ చేపట్టనున్నట్టు తెలిపారు. స్థానిక పూల్‌బాగ్‌లో చలో కలెక్టరేట్ కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి జీవో 30 విడుదలై ఏడాదైనా విజయనగరంలో ఒక్కరికీ కూడా పట్టా ఇవ్వలేదని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వి.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ 1న గీత కులాల రాష్ట్ర మహాసభలు
విజయనగరం గంటస్తంభం: గీత కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 1న సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్నాయని రాష్ట్ర యాత సంఘం అధ్యక్షుడు అంగటి రాము తెలిపారు. అనంతరం జిల్లాలో ఆహ్వాన పత్రిక విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ, గీత కులాల అభివృద్ధికి ఈ మహాసభలు కీలకం కానున్నాయని పేర్కొన్నారు. నాయకులు, సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గీత వృత్తి కుటుంబాల సంక్షేమానికి కొత్త ప్రణాళికలు ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో అంగటి మూర్తి, వెంకటేష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
సీజ్ చేసిన మద్యం ధ్వంసం
పాలకొండ: స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో గత తొమ్మిది నెలలుగా పలు కేసుల్లో పట్టుబడిన మద్యం, సారాను అధికారులు శనివారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ సీఐ సూర్యకుమారి మాట్లాడుతూ గత తొమ్మిది నెలల్లో నమోదు చేసిన 25 కేసులకు సంబంధించి 636 లీటర్ల సారా, 30 బెల్ట్ కేసుల్లో 232 మద్యం బాటిల్స్‌ను ధ్వంసం చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు ఎల్.తిరుపతిరావు, జి.ఫణేంద్రబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బొబ్బిలిరూరల్: మండలంలోని అలజంగి వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అర్‌ఐ రామకుమార్ శనివారం పట్టుకున్నారు. ట్రాక్టర్ల యజమానులను తన కార్యాలయానికి రప్పించి మందలించిన తహసీల్దార్ ఎం.శ్రీను ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10 వేలు చొప్పున రూ.20వేల జరిమానా విధించారు. ఇది మొదటి సారి కావడంతో జరిమానాతో విడిచిపెడుతున్నామని మరోసారి అక్రమ ఇసుకతో దొరికితే సీజ్ చేస్తామని ట్రాక్టర్ యజమానులకు హెచ్చరించారు.
కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం కరెంటు షాక్‌తో ఒక వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని పద్మావతి నగర్ ఆరవ లైన్‌లో ఉంటున్న ఉప్పలూరి సాల్మన్‌రాజు(25) పెయింట్ పని చేస్తుంటాడు. శివాలయం వీధిలో ఒక ఇంటికి పెయింటింగ్ పని చేస్తుండగా కరెంటు సర్వీస్ లైన్ తగిలి అక్కడికక్కడే కింద పడిపోయాడు. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి చికిత్సకై చేర్పించడంతో అప్పటికే మృతి చెందాడు. భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా సాల్మన్‌రాజుకు ఆరు నెలల కిందటే పైళ్లెంది.
24న చలో కలెక్టరేట్
24న చలో కలెక్టరేట్
24న చలో కలెక్టరేట్


