బాలికలకు స్వీయ రక్షణ అవసరం : కలెక్టర్
సీతానగరం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బాలికలకు స్వీయ రక్షణ అవసరమని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. జోగింపేట కేజీబీవీ విద్యాలయంలో సమగ్రశిక్ష, రుద్రమదేవి సెల్ఫ్ డిఫె న్స్ అకాడమి, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాణి లక్ష్మీభాయ్ స్వీయ రక్షణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ రాణి లక్ష్మీభాయ్ స్వయం రక్షక్ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బాలికలకు ఆత్మరక్షణకు శిక్షణ దోహద పడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణతో పాటు నైపుణ్యాలు ఎంత ముఖ్యమో వివరించారు. ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎంత విద్య నేర్పినా తమ ప్రాణాలను కాపాడుకునే విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సి ఉందన్నారు. బాలికలంద రూ శిక్షణను వినియోగించు కోవాలని కోరారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న ఉస్తాబు కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్వాహకులకు ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, కేజీబీవీ ప్రిన్సిపాల్ జె.సఽంధ్య, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, కో ఆర్డినేటర్ ఎస్.ప్రభాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


