
29న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా
సాలూరు: ఈ నెల 29 న సాలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఉషశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. దివిస్ ల్యాబొరేటరీస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళా శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని అన్నారు.ఆసక్తిగల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9440537105 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
జాతీయ స్థాయి పారా త్రోబాల్ పోటీలకు సచివాలయం ఉద్యోగి
కొత్తవలస: మండలంలోని గనిశెట్టిపాలెం గ్రామ సచివాలయంలో డిజిటల్ సహాయకుడిగా పనిచేస్తున్న పొటిపిరెడ్డి శ్రీను జాతీయ స్థాయి పారా త్రోబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఒక ప్రకటనలో మంగళవారం ఆయన తెలిపారు.ఈ నెల 8వ తేదీన విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో శ్రీను ఉత్తమ ప్రతిభ కనబర్ఛడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా శ్రీనును పలువురు అభినందించారు.
4.8 కేజీల గంజాయి స్వాధీనం
సంతకవిటి: మండలంలోని పొనుగుటివలస పరిధిలోని జీఎమ్‌ఆర్‌ఐటీ కళాశాల ఎదురుగా గల మామిడి తోటలో సోమవారం సాయంత్రం 4.8కేజీల గంజాయిని పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు నలుగురు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. పాలకొండ ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సోమవారం రాత్రి కేసు నమోదు చేసి మంగళవారం వారిని అంపోలు సబ్‌జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు.
సాలూరులో 5.60 కిలోల గంజాయి..
సాలూరు: పట్టణంలో ఇద్దరు వ్యక్తుల నుంచి గంజాయిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ పాత బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డు వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని అందిన సమాచారం మేరకు వారి వద్దకు వెళ్లి విచారణ చేస్తున్న క్రమంలో తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఆ వ్యక్తుల బ్యాగుల్లో 5.60 కేజీల గంజాయిని గుర్తించామని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశామని, నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు.
ఏనుగుల గుంపుతో జాగ్రత
కొమరాడ: మండలంలోని కోటిపాం పరిసరాల్లో ఉన్న పంట పొలాల్లో తొమ్మిది ఏనుగుల గుంపు సంచరిస్తోంది. అయితే కోటిపాం గ్రామస్తులు సాయత్రం ఆరుగంటల నుంచి తెల్లవారు జామున ఆరు గంటల వరకు బయటకు రావద్దని జిల్లా అటవీశాఖ అధికారి ప్రసూన మంగళవారం ఒక ప్రకటనలో తెలయజేశారు. బయటకు రావాల్సి వస్తే అటవీశాఖ సిబ్బంది సహాయం కోరాలని ఆమె సూచించారు.

29న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా