
వారి వల్లే కాదంటున్నారు.. మరెవరికి చెప్పుకోవాలి!
బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి చెందిన ఈయన పేరు గుల్లిపల్లి నారాయణరావు. పెదపెంకి గ్రామ రెవెన్యూ పరిధిలో ఈయనకు 0.98 సెంట్ల భూమి ఉంది. వీరి ఖాతాకు ఇంకెవరిదో ఆధార్ లింకు అయిపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు, ఇతర రాయితీలేవీ అందుకోలేకపోతున్నాడు. ఇదే కారణంతో ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన అన్నదాత సుఖీభవ లబ్ధిని కూడా పొందలేకపోయాడు. దీనిపై గ్రామ వ్యవసాయ సహాయకులు, వీఆర్వో, తహసీల్దారులను కలిస్తే.. తొలగించడం తమ చేతుల్లో లేదని చేతులెత్తేస్తున్నారు. దీంతో పీజీఆర్‌ఎస్‌కు వచ్చి ఆయన అర్జీ పెట్టుకున్నాడు.