
విసిగి పోవాలే గానీ!
‘రెవెన్యూ’పైనే శ్రద్ధ.. వినతులపై అశ్రద్ధ ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని భూసమస్యలు పదేపదే రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు పీజీఆర్‌ఎస్‌కు క్యూ కడుతున్న బాధితులు.. అక్కడా కలగని మోక్షం
ఇంకెవరికి చెప్పుకోవాలి?
వేరెవరి పేరు మీదనైనా మార్చేయగలరు. క్షణాల్లో వన్‌బీలు, పాస్ పుస్తకాలు సృష్టించేయగలరు. లంచం లేకుండా నిజాయితీగా పేదలు ఎన్నిసార్లు తిరి గినా అక్కడ పట్టించుకునే వారు కరవు. రెవెన్యూ శాఖపై ఇది ఎప్పటి నుంచో ఉన్న ముద్ర. తరచూ ఏసీబీ అధికారుల దాడిలో దొరికిపోతున్నా అక్కడి సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదు. ఆదా యం సమకూర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ.. వినతుల పరిష్కారంలో చూపడం లేదన్న విమర్శలు వినిపి స్తున్నాయి. ఈ కారణంగానే రెవెన్యూ సంబంధిత భూ సమస్యలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. బాధితులు కలెక్టరేట్ చుట్టూ పదేపదే తిరుగుతున్నా.. అక్కడా వారికి భరోసా దొరకడం లేదు.
సాక్షి, పార్వతీపురం మన్యం :
‘ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు సరైన పరిష్కారాన్ని చూపాలి. లేకుంటే అందుకు గల కారణాలేమిటో కచ్చితత్వంతో కూడిన సమాచారంతో తెలియజేయాలి.’.. ఇదీ పీజీఆర్‌ఎస్‌పై కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులకు చేసిన దిశానిర్దేశం. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఇవే మాటలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిష్కారానికి నోచుకున్న హామీలను వేలిమీద లెక్కపెట్టి చెప్పవచ్చు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి సగటున వంద నుంచి 150 వరకు అర్జీలు వస్తున్నాయి. ఇందులో 60–70 శాతం వరకు రెవెన్యూ, భూ సంబంధిత సమస్యలపైనే ఉంటున్నాయి. తన పేరిట ఉన్న భూమి.. వేరొకరి పేరు మీద ఆన్‌లైన్‌లో చూపించడం, పాస్ పుస్తకం మంజూరు చేయాలని.. వన్‌బీ, అడంగల్‌లో సవరణలు.. రికార్డుల్లో తప్పుగా నమోదు కావడం, భూ ఆక్రమణలు.. ఇలా వందలాది వినతులు వస్తున్నాయి. గ్రామ, మండల స్థాయిలో అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. పరిష్కారానికి నోచుకోకపోవడంతో కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు క్యూ కడుతున్నారు. ఇక్కడ కూడా అధికారులు వాటిని తీసుకోవడం.. కింది స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వడం.. అక్కడితో దానిని వదిలేయడం.. ఇదే తంతు ఎన్నిసార్లయినా సాగుతోంది. ఒకటికి పదిసార్లు వ్యయప్రయాసలకు ఓర్చి, కలెక్టరేట్‌కు వస్తున్నా.. రెవెన్యూపరమైన సమస్యలకు మోక్షం కలగడం లేదు. ఏదో కారణం
సాలూరు మండలం కొట్టిపరువు పంచాయతీ యరగడవలస గ్రామంలోని ఎస్టీ కొండదొర సామాజిక వర్గానికి చెందిన మూదూరు సీతయ్యకు అక్కడి సర్వే నంబరు 142, 149, 40, 41, 38, 37, 139–7పీల్లో మొత్తం 3.59 ఎకరాల భూములు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా వీరి ఆధీనంలోనే ఉండటంతో పాటు.. స్థానిక తహసీల్దార్ నుంచి పట్టాదారుపాస్ పుస్తకం కూడా పొందారు. కొంత భూమి ఆన్‌లైన్ చేయాల్సి ఉందని, ఇటీవల కాలంలో తమ స్థలంలో కొంతమంది దౌర్జన్యం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. తమ భూమిలో వేసుకున్న జీడి, మామిడితోటలను నరికేయడమే కాక.. వరినాట్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. అడిగితే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదని.. తాను ఇప్పటి వరకు సమర్పించిన దరఖాస్తులను పట్టుకుని సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు వచ్చాడు.
చూపిస్తూ, ఆ వినతిని పెండింగులో లేకుండా అధికారులు క్లియర్ చేసేస్తున్నారు. కనీసం అర్జీదారులు సంతృప్తి చెందేలా సమాధానం కూడా ఇవ్వడం లేదు. ఇటువంటి తరహాలోనే అనేక వినతులు పదేపదే రీఓపెన్ అవుతున్నాయి.
‘రెవెన్యూ’పైనే శ్రద్ధ..
రెవెన్యూలో కాసులిస్తే.. ఎవరి పేరిట భూమిని..

విసిగి పోవాలే గానీ!