
కూటమి తీరుపై.. కదంతొక్కిన ఆటోడ్రైవర్లు
కొమరాడ: కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు కదంతొక్కారు. ఉచిత బస్సు పథకంతో ఉపాధి కోల్పోయిన డ్రైవర్లను ఆదుకోవాలంటూ కొమరాడలో మజ్జిగౌరీ తల్లి ఆటో యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్డార్ సత్యనారాయణకు వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం వాహనమిత్ర పథకం కింద ఏడాది రూ.10వేలు అందజేస్తే.. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం పేరిట మా పొట్టకొట్టిందని వాపోయారు. వాహనమిత్ర పథకం కింద రూ.25 వేలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కొల్లు సాంభమూర్తి, బి.గోపి, కోరాడ చిన్న, బాసింగి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.