
25 నాటికి సమచారం అప్‌డేట్ కావాలి
● కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం రూరల్: అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఈ పెర్‌ఫార్‌మెన్స్ ఇండికేటర్ (కేపీఐ)లను ఈ నెల 25లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మాసిక, త్రైమాసిక, వార్షిక లక్ష్యాలు, ప్రగతిని నమోదు చేయాలని వీడియోకాన్ఫరెన్స్‌లో శనివారం సూచించారు. పొరపాట్లకు తావివ్వకుండా చూడాలన్నారు. సమావేశంలో జేసీ ఎస్‌ఎస్ శోభిక, డీఆర్వో కె.హేమలత, ఎస్‌డీసీ ఎస్.దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
బీఎల్‌ఓలకు సహకరించండి
పార్వతీపురం: ఓటరు జాబితా తయారీలో రాజకీయ పక్షాల ప్రతినిధులు, బీఎల్‌ఓలకు సహకరించాలని కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి ఎన్.చిన్నారావు కోరారు. కలెక్టర్ కార్యాలయంలోని డీఆర్‌ఓ చాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు ఒక నియోజకవర్గంలోనే నమోదై ఉండాలన్నారు. ఓటరు వేరే ప్రాంతానికి బదిలీ అయితే, తన ఓటుహక్కును కూడా బదిలీ చేసుకోవాలన్నారు. సమావేశంలో వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
చిన్నారులకు మెరుగైన వైద్యం
● డీఎంహెచ్‌ఓ భాస్కరరావు
పార్వతీపురంటౌన్: చిన్నారులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు డీఎంహెచ్‌ఓ ఎస్.భాస్కరరావు తెలిపారు. ఎన్‌హెచ్‌ఎం, ఆర్‌బీఎస్‌కేలో భాగంగా జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రంలో శనివారం నిర్వహించిన ఉచిత గుండె వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించారు. విశాఖపట్టణం నుంచి వచ్చిన గుండె వైద్యనిపుణులు ఎ.అశోక్‌రాజు 18 ఏళ్ల లోపు బాలలు 26 మందికి గుండె పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఏడుగురిని మెరుగైన వైద్యసేవల కోసం ఎన్టీఆర్ వైద్యసేవ కింద మెడికవర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు టి. జగన్మోహన్‌రావు, రఘుకుమార్, పిల్లల వైద్యనిపుణులు భరత్ చంద్ర, ఎపిడిమాలజిస్ట్ కౌశిక్ పాల్గొన్నారు.
బొబ్బిలి: రాష్ట్రంలో కొత్తగా వితంతువులు, వృద్ధులు, నిరుపేద వర్గాలవారికి ఒక్క పింఛన్ మంజూరు చేయకుండా, గత ప్రభుత్వం మంజూరు చేసిన దివ్యాంగుల పింఛన్ల తొలగింపుకు కూటమి ప్రభుత్వం పూనుకోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. బొబ్బిలిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి పాలనలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, కోతలే కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఏడాది పాలనలో 4లక్షల పింఛన్లను నిలివేయగా, జిల్లాలో 80వేల పింఛన్లు తొలగించిన ఘనత కూటమిదేనన్నారు. దివ్యాంగులు దేవుడు బిడ్డలని, వారికి అండగా ఉండి ఆదుకోవాల్సిన ప్రభుత్వం కక్షసాధిస్తోందన్నారు. దివ్యాంగులకు అండగా వైఎస్సార్‌సీపీ ఉంటుందని స్పష్టంచేశారు. యూరియా కోసం రైతులు నానా పాట్లు పడాల్సి వస్తోందన్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఎరువు కష్టాలకు ప్రధాన కారణమన్నారు.
నిరుద్యోగ భృతి ఏదీ?
ఎన్నికల ముందు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న కూటమి నాయకులు ఇప్పుడు ఏం మాట్లాడడం లేదన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారన్నారు. 16 నెలల్లో ఎంతమందికి నిరుద్యోగ భృతి చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

25 నాటికి సమచారం అప్‌డేట్ కావాలి

25 నాటికి సమచారం అప్‌డేట్ కావాలి