రక్త పరీక్ష కేంద్రాల్లో అక్రమ వసూళ్లు! | - | Sakshi
Sakshi News home page

రక్త పరీక్ష కేంద్రాల్లో అక్రమ వసూళ్లు!

Aug 24 2025 8:33 AM | Updated on Aug 24 2025 8:33 AM

రక్త

రక్త పరీక్ష కేంద్రాల్లో అక్రమ వసూళ్లు!

రక్త పరీక్ష కేంద్రాల్లో అక్రమ వసూళ్లు!

జిల్లాలో 47 రక్త పరీక్ష కేంద్రాలు

మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ స్పెషల్‌ ప్యాకేజీలంటూ వసూళ్లు

ప్యాకేజీ కింద రూ.2 వేల నుంచి 2500 వరకు వసూళ్లు

పార్వతీపురం టౌన్‌: పల్లె, పట్టణం అన్న తేడా లేదు.. మంచం పట్టని గ్రామం అంతకన్నా లేదు.. వీధివీధినా.. ఇంటింటిలో జ్వరంతో ప్రజలు అల్లాడుతున్నారు. జ్వర బాధితులను కాళ్లు వాపులు, ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయి. వచ్చింది ఏ జ్వరమో తెలుసుకునేందుకు రక్త పరీక్ష కేంద్రాలకు వెళ్తే మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ ప్యాకేజీ అంటూ రూ.2వేల నుంచి రూ.2500 వరకూ కేంద్రాల నిర్వాహకులు వసూలు చేస్తున్నారు.

నెల రోజులుగా..

నెల రోజులుగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రైవేట్‌ రక్త పరీక్ష కేంద్రాల నిర్వాహకులు ఒక్కొక్క పరీక్షకు ఒక్కో రేటు అన్న చందంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏ పరీక్షకు ఎంత ధర అన్న వివరాలు తెలిపే బోర్డులు ఏవీ ఏర్పాటు చేయడం లేదు. జ్వర పీడితులు అధికంగా ఉండటంతో మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ పరీక్షలకు ప్రత్యేక ప్యాకేజీ అంటూ వేల రూపాయిలు వసూలు చేస్తున్నారు. జ్వర పీడితులను తమ వద్దకు పంపించిన ప్రైవేటు వైద్యులు, ఆర్‌ఎంపీలకు రక్త పరీక్ష కేంద్రాల నిర్వాహకులు కమీషన్లు ముట్టజెబుతున్నారు. సీజనల్‌ వ్యాధుల ముసుగులో రక్త పరీక్ష కేంద్రాల వారు బాగా దండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పీహెచ్‌సీల్లో అంతంతమాత్రంగానే...

జిల్లాలొని 37 పీహెచ్‌సీలతో పాటు ఐదు పట్టణ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లు ఉన్నాయి. గతంలో ఆసుపత్రుల్లో నిత్యం ఓపీకి 20 నుంచి 30 వరకు వచ్చేవారు. గత వైఎస్సార్‌ సీపీ పాలనలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది పెరగడమే కాకుండా, అవసరమైన మందులు, రక్త పరీక్షలకు యంత్ర పరికరాలు సమకూరాయి. వైద్య సేవలు మెరుగు కావడంతో రోజుకు వంద మంది ఓపీ సేవలు అందించేవారు. రక్త పరీక్షల సామగ్రి పీహెచ్‌సీలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో గతంలో పరీక్షలు వేగవంతంగా చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పీహెచ్‌సీల అభివృద్ధి గాలికి వదిలేయడంతో పీహెచ్‌సీల్లో సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయన్న విమర్శలున్నాయి.

డిస్‌ప్లే బోర్డులు తప్పనిసరి

రక్త పరీక్ష కేంద్రాల్లో ధరలకు సంబందించి డిస్‌ప్లే బోర్డులు తప్పనిసరిగా ప్రదర్శించాలి. అధిక ధరలు వసూలు చేస్తున్న ల్యాబ్‌లను గుర్తించి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన ల్యాబ్‌లలో మాత్రమే రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. అన్ని పీహెచ్‌సీలలో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రజలు గమనించాలి.

– డాక్టర్‌ టి.జగన్మోహన్‌రావు,

ఎన్సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి

చర్యలు తీసుకుంటాం..

రక్త పరీక్ష కేంద్రాల నిర్వాహకులు అధిక ధరలు వసూలు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అధిక ధరలు వసూలు చేస్తున్న వారి వివరాలు తెలిపితే అక్కడకు వెళ్లి విచారణ చేస్తాం. ల్యాబ్‌ల్లో తనిఖీలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. ఎక్కడ అధికంగా వసూలు చేసినా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్‌ భాస్కరరావు,

డీఎంఅండ్‌హెచ్‌వో, పార్వతీపురం

రక్త పరీక్ష కేంద్రాల్లో అక్రమ వసూళ్లు! 1
1/2

రక్త పరీక్ష కేంద్రాల్లో అక్రమ వసూళ్లు!

రక్త పరీక్ష కేంద్రాల్లో అక్రమ వసూళ్లు! 2
2/2

రక్త పరీక్ష కేంద్రాల్లో అక్రమ వసూళ్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement