
స్వచ్ఛాంధ్ర ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● జేసీ ఎస్.ఎస్.శోభిక
పార్వతీపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా నాలుగో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ పార్వతీపురం కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక అన్నారు. తన చాంబర్ నుంచి కార్యక్రమం నిర్వహణ, అవార్డుల ప్రదానంపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో శుక్రవారం సమీక్షించారు. పల్లెలు, పట్టణాలు, గృహాలు, బహిరంగ ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య పను లు చేపట్టాలన్నారు. పనులకు సంబంధించిన ఫొటోలు అప్‌లోడ్ చేయాలని సూచించారు. తాగునీటి పరీక్షలు నిర్వహించి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని కోరారు. మెరుగైన పనితీరు కనబరిచే వారికి అక్టోబర్ 2న బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. సమావేశంలో డీపీఓ కొండలరావు, డీఈఓ రాజ్‌కుమార్, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, డీఎంహెచ్‌ఓ డా.భాస్కరరావు, డీఏఓ కె.రాబర్ట్‌పాల్, ఎంపీడీఓలు, కమిషనర్లు పాల్గొన్నారు.
ఇన్‌చార్జి పీఓగా బాధ్యతల స్వీకరణ
సీతంపేట: ఐటీడీఏ ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారిగా పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ శుక్రవారం పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ఐటీడీఏలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని సమీక్షిస్తానని, క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి చేయాల్సిన వివరాలు తెలియజేస్తానన్నారు.
విద్యాసంస్కరణల అమలుతో వికసిత్‌భారత్
● ఏబీఆర్‌ఎస్‌ఎం జాతీయ సంయుక్త వ్యవస్థాపక కార్యదర్శి జి.లక్ష్మీస్
విజయనగరం అర్బన్: నవ భారత్ నిర్మాణానికి జాతీయ విద్యా విధానం–2020 సంస్కరణల అమలు కీలకమని అఖిల భారత రాష్ట్రీయ శిక్షక్ మహాసంఘ్ (ఏబీఆర్‌ఎస్‌ఎం) జాతీయ సంయుక్త వ్యవస్థాపక కార్యదర్శి గుంథ లక్ష్మీస్ అన్నారు. కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో ‘హమారా సంవిధాన్–హమారా స్వాభిమాన్– వికసిత్ భారత్ కోసం జాతీయ విద్యావిధానం–2020 ఆత్మలా ఉంది’ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రాజ్యాంగ విలువలు, సాంస్కృతిక గౌరవం, విద్యా సంస్కరణలు వంటి చర్యల అమలు వికసిత్ భారత్ నిర్మాణానికి కీలకమన్నారు. వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ మాట్లాడుతూ నూతన విద్యావిధానం అమలుతో విద్యా నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు. అనంతరం ముఖ్య అతిథిని సత్కరించారు. కార్యక్రమంలో వర్సిటీ ఏబీఆర్‌ఎస్‌ఎం అధ్యక్షురాలు డాక్టర్ పరికిపాండ్ల శ్రీదేవి, వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, వివిధ విభాగాల అధ్యాపకులు ప్రేమాచటర్జీ, బి.కోటయ్య, కె.సురేష్‌బాబు, బి.వెంకటేశ్వర్లు, ఎం.గంగునాయుడు, పి.కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగోన్నతి తర్వాతే
డీఎస్సీ నియామకాలు చేపట్టాలి
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతి కోటాను భర్తీ చేసిన తర్వాతే మెగా డీఎస్సీ నియామకాలు చేపట్టాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కమిటీ సభ్యులు శుక్రవారం డీఈఓ యు.మాణిక్యంనాయుడును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఉద్యోగోన్నతి కల్పించకుండా డీఎస్సీ నియామకాలు చేపడితే ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడైన పాఠశాలల భవనాలను బాగుచేయాలని విన్నవించారు. డీఈఓను కలిసిన వారిలో సంఘ నాయకులు కె.జోగారావు, సీహెచ్ సూరిబాబు, ఎస్.చిట్టిబాబు, పి.లక్ష్మణరావు, బి.అడివయ్య, వాసుదేవరావు, వి.మల్లేశ్వరరావు, రవి తదితరులు ఉన్నారు.

స్వచ్ఛాంధ్ర ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

స్వచ్ఛాంధ్ర ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి