
వినేవారే లేరా?
పోరాటం ఉద్ధృతం చేస్తాం
వీఆర్‌ఏల గోడు..
పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తోంది... వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి కనీసం చొరవ చూపడంలేదు. వినతులు అందజేసినా ఫలితం లేదు. నెలకు ఇచ్చిన రూ.11వేల వేతనంతో కుటుంబాన్ని పోషించేందుక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
పదోన్నతుల కల్పనలో కూటమి కినుక వహిస్తోంది. వాచ్‌మన్ ఉద్యోగం సైతం చేయిస్తోంది. ఖాళీలను భర్తీ చేయకుండా పనిభారం మోపుతోంది. వీఆర్‌ఏల గోడు వినేవారే లేరు. అందుకే శనివారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలకు సిద్ధమవుతున్నట్టు వీఆర్‌ఏల సంఘం నాయకులు తెలిపారు. సెప్టెంబరు 2న జిల్లా కేంద్రలో నిరసన తెలియజేస్తామన్నారు.
వీఆర్‌ఏల సమస్యలపై దృష్టి సారించని కూటమి
నిబంధనలకు విరుద్ధంగా వాచ్‌మన్ విధులు
చాలీచాలని వేలతనాలతో ఆర్థిక ఇబ్బందులు
జిల్లాలో 338 మంది వీఆర్‌ఏలు
సమస్యలు పరిష్కరంచాలంటూ నేటి నుంచి పోరుబాట
వీఆర్‌ఏలకు నెలకు రూ.11వేలు వేతనమే అందజేస్తుండడంతో జిల్లాలో పనిచేస్తున్న 338 మంది వీఆర్‌ఏలు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు అని చూడకుండా నైట్ వాచ్‌మన్ విధులకు పంపుతున్నారు. ఖాళీగా ఉన్న వాచ్‌మన్, అటెండర్ పోస్టులు భర్తీ చేయాలి. అదనపు పనిభారం నుంచి విముక్తి కలిగించాలి. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయినా మా సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నేటి నుంచి నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తాం.
– ఈశ్వరరావు, వీఆర్‌ఏల
సంఘం జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం