
సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్
రాజాం సిటీ: వచ్చే నెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి కె.శారదాంబ అన్నారు. రాజాం కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ న్యాయవాదులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీకి అనుకూలమైన క్రిమినల్, సివిల్, ప్రీ లిటిగేషన్ కేసులన్నీ లోక్ అదాలత్‌తో పరిష్కరించుకోవచ్చన్నారు. న్యాయవాదులు, పోలీసులు లోక్‌అదాలత్‌కు సహకరించి వీలైనన్ని కేసులను పరిష్కరించుకునే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సివిల్ కేసులు పరిష్కారమైతే కోర్టు ఫీజులు కూడా వాపసు ఇవ్వనున్నా మని పేర్కొన్నారు. జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి సీహెచ్ హరిప్రియ, బార్ అసోసియేషన్ కార్యదర్శి బి.తిరుపతినాయుడు, ప్రభుత్వ న్యాయ వాది పి.శ్రీనివాస్, కె.రమణమూర్తి, ఆర్.రామమూర్తినాయుడు, జె.అప్పలనాయుడు, వైఎస్ శ్రీనివాస్, ఎస్.జయలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.