
సీసీరోడ్డు, ఇళ్లు మంజూరు చేయండి
జియ్యమ్మవలస రూరల్: జియ్యమ్మవలస మండలంలోని ఏనుగుల గూడ గ్రామానికి ిసీసీ రోడ్డు వేయడంతో పాటు ిపీఎం జన్‌దన్ యోజన కింద పక్కా ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యతని గుర్తు చేశారు. గ్రామ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామస్తులతో కలిసి మంగళవారం నినదించారు. కార్యక్రమంలో సీపీఎం జియ్యమ్మవలస మండల కార్యదర్శి కూరంగి సీతారాం, గిరిజన సంఘం నాయకులు మండంగి రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకుడు గరుగుబిల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు.