
పింఛన్ల కోత
ఇది అన్యాయం – ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
రద్దు చేసిన దివ్యాంగుల పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఆర్భాటంగా హామీల వర్షం కురిపించిన కూటమి నాయకులు.. ఇప్పుడు పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలను కుదించేందుకు కుట్రలు చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయు డు, కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌వై నాయుడు విమ ర్శించారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
రేగిడి: దివ్యాంగుల పింఛన్లు రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్‌సీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తలే రాజేష్‌లు అన్నారు. రేగిడిలో సోమ వారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దివ్యాంగులకు రూ.6వేలు పింఛన్ అందజేస్తున్నామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు పింఛన్లు రద్దుచేస్తూ నోటీసులు అందజేస్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నా రన్నారు. ఇంతవరకు కొత్తగా ఒక్క దివ్యాంగునికి కూడా పింఛన్ మంజూరుచేయకుండా, ఇప్పుడు ఉన్నవి రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం శోచనీయమన్నారు. దివ్యాంగుల్లో బోగస్ పింఛన్ పొందుతున్నవారు ఉన్నారని చంద్రబాబు చెబు తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడు పింఛన్ రద్దు అయిన వారిలో గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పింఛన్ మంజూరైన వారు ఉన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే ఆధార్ కార్డులు మార్పుచేసుకుని తెలుగుదేశం నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు లబ్ధిదారులైన విషయం కూటమి నాయకులు గుర్తెరగాలని వివరించారు. మరోసారి విశాఖపట్నం కేజీహెచ్ వైద్యాధికారులతో పింఛన్ రద్దయిన దివ్యాంగుల దివ్యాంగత్వాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల తరఫున పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరా వు, వైఎస్సార్ సీపీ రాజాం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పింఛన్ల కోత