
జోరువానలో నిరసన హోరు
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సీఆర్‌టీలకు బకాయిలున్న జీతాలను తక్షణమే చెల్లించాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే కాంట్రా క్టు ఉపాధ్యాయులు బతికేది ఎలా అని ప్రశ్నించా రు. ఐటీడీఏ కార్యాలయంలో ఏఈగా పిలవబడే జి.తిరుపతిరావుకు పనిలేకుండా జీతాలు ఎలా చెల్లిస్తున్నారో చెప్పాలన్నారు.
పార్వతీపురం రూరల్: ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ప్రజల నిరసన హోరు కొనసాగింది. వివిధ సమస్యలపై కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌కు వినతులు అందజేశారు.
నా పేరు వావిలిపల్లి శంకరరావు. మాది పార్వతీపురం మున్సిపాల్టీ పరిధిలోని జగన్నాథపురం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హత ఉన్న పథకాలన్నీ అందాయి. పిల్లలకు విద్యాదీవెన, రైతుభరోసా నిధులు బ్యాంకు ఖాతాకు జమయ్యా యి. కూటమి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఖాతాకు జమకాలేదు. అధికారులను ఆశ్రయిస్తే తను మరణించినట్టు ఆన్‌లైన్‌లో చూపిస్తున్నట్లు తెలిపారు. ఇదెక్కడి అన్యాయమంటూ వాపోయారు. బాసంగి గ్రామానికి చెందిన సింహాచలం కూడా అన్నదాత సుఖీభవతోపాటు ప్రభుత్వం నుంచి ఏ పథకాలు అందడంలేదంటూ కలెక్టర్‌కు వినతిపత్రా న్ని అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలు, మండ లాలు ఏర్పాటు, సరిహద్దుల మార్పిడికి ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు కురుపాం మండలంలో తూర్పు ముఠా ప్రాంతానికి చెందిన ఆదివాసీయులకు ప్రత్యేకంగా మొండెంఖల్‌ను మండల కేంద్రంగా చేయాలని ట్రైబల్‌రైట్స్‌ఫారం నాయకులు డిమాండ్ చేశారు. కురుపాం రావాలంటే దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్లు ప్ర యాణించాల్సి వస్తోందన్నారు. 15వేలకు పైగా జనాభా కలిగి ఉన్న ఆదివాసీలకు ప్రత్యేక మండలం కేటాయంచాలని కలెక్టర్‌కు విజ్ఞప్తిచేశారు.
గత ప్రభుత్వం మక్కువ మండలం పనసభద్ర పంచాయతీలో చెక్కవలస గ్రామానికి ఎర్ర సామంతవలస వరకు ఉపాధిహామీ నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టింది. పనులు మధ్యలో నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలవుతున్నా అసంపూర్తి పను లు పూర్తిచేయడంపై దృష్టిపెట్టడం లేదు. రోడ్డు నిర్మాణానికి వేసిన కంకర వర్షాలకు కొట్టుకుపోతోంది. రాకపోకలకు ఇబ్బందులు పడుతు న్నాం. తక్షణమే రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
పార్వతీపురం మున్సిపాల్టీలో ఆప్కాస్ విధానంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ మృతిచెందిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూ నియన్ డిమాండ్ చేసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేశారు.

జోరువానలో నిరసన హోరు

జోరువానలో నిరసన హోరు

జోరువానలో నిరసన హోరు

జోరువానలో నిరసన హోరు