
ఏకగ్రీవంగా పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఎన్నిక
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ (ఏపీపీఆర్‌ఎంఈఏ) జిల్లా శాఖ నూతన కమిటీని సభ్యు లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో శనివారం జరిగిన ఎన్నికల్లో నూతన కమిటీని ప్రకటించారు. సంఘ అధ్యక్షుడిగా సీహెచ్ మురళి, ప్రధాన కార్యదర్శిగా పి.ఎం.రవికుమార్, అసో సియేట్ అధ్యక్షుడిగా బి.వి.నాగభూషణరావు, ఉపాధ్యక్షుడిగా టి.ప్రవీణ్‌కుమార్, కోశాధికారిగా వి.రాంబాబు, జాయింట్ సెక్రటరీగా ఎల్.వి.ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె.రాజ్‌కుమార్, ఎం.నారాయణరావు, డి.లత, డీహెచ్‌వీఆర్ ప్రభాకర్, బి.లక్ష్మణ్‌కుమార్, రాష్ట్ర కౌన్సిలర్లు ఎన్.అర్జునరావు, వి.ఎ.వర్మ, ఎ.రమణమూర్తి, కె.వి.శ్రీనివాసరావు, జేసీసీ మెంబర్‌గా బి.వి.గోవిందరావు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా విజయనగరం జిల్లా ఏపీఎన్‌జీజీఓ అధ్యక్షుడు టి.శ్రీధర్‌బాబు, సహాయ ఎన్నికల అధికారులుగా పట్టణ ఏపీఎన్‌జీఓ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.గోపాలకృష్ణ, ఎన్నికల పరిశీలకులుగా విశాఖ జిల్లా సంఘం అధ్యక్షుడు ఎస్.సత్తిబాబు, తూర్పుగోదావరి జిల్లా ఏపీఎన్‌జీజీఓ జాయింట్ సెక్రటరీ ఎన్ ఎంకేజీ ప్రసాద్ వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.వి.వి.
రమేష్, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బండి శ్రీనివాస్ హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షు లు గంటా వెంకటరావు, ఆర్.వి.రమణమూ ర్తి, ఏపీఎన్‌జీజీఓ జిల్లా కార్యదర్శి ఎ.సురేష్, జిల్లా, తాలూకా యూనిట్ల సభ్యులు పాల్గొన్నారు.
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం విజయనగరం పెన్షన్ సంఘం కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగింది. తొలుత అసోసియేషన్ జండాను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు రామచంద్రపండ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూపీ హైకోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ విద్యాసాగర్, ప్రత్యేక అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రరావు, రాష్ట్ర కార్యదర్శి ఎల్.వి.యుగంధర్, రాష్ట్ర కోశా ధికారి సొంటి కామేశ్వరరావు, జిల్లా కార్య దర్శి బి.బాలభాస్కర్, జిల్లా కోశాధికారి వై.శంకరరావు, ఆదినారాయణ, రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా ముందుకు సాగాలని నిర్ణయించారు.

ఏకగ్రీవంగా పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఎన్నిక