
ఏపీజీఈఏ 6వ వార్షికోత్సవం
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) 6వ వార్షికోత్సవం జిల్లా కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత సంఘ పతాకాన్ని జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణ ఆధ్వర్యంలో ఏపీజీఈఏ రాష్ట్ర నాయకుడు, డిప్యూటీ డైరెక్టర్ అండ్ విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్ (మెడికల్) శ్రీనివాస్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎల్.వి.యుగంధర్, జిల్లా కార్యదర్శి బి.బాలభాస్కరరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ పువ్వల శ్రీనివాస రావు, కోశాధికారి వై.శంకరరావు, ఉపాధ్యక్షులు ఎన్.వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి జి.లక్ష్మీనాయుడు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు చింతల వెంకట సతీష్, బియ్యాల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రంభ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.