
ఇదే మా పాఠశాల..!
చిత్రంలో కనిపిస్తున్న చిన్నరేకుల షెడ్డులోనే సాలూరు మండలం తోణాం పంచాయతీ బొర్రమామిడివలస ప్రాథమిక పాఠశాల నిర్వహిస్తున్నారు. గతంలో భవనం
మంజూరైనా నిర్మాణం పూర్తి చేయలేదు. శ్లాబ్ లెవెల్‌లో పిల్లర్స్‌తో దర్శనమిస్తోంది. చేసేది లేక ఇక్కడ ఒకటి, రెండు తరగుతులు చదువుతున్న 13 మంది విద్యార్థులకు
రేకుషెడ్డులోనే బోధన సాగిస్తున్నట్టు
ఉపాధ్యాయుడు తెలిపారు. వర్షం కురిస్తే కారిపోతోందని, విషసర్పాల భయం
వెంటాడుతోందని, భవన నిర్మాణం పూర్తిచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులతో పాటు ఉపాధ్యాయుడు విజ్ఞప్తి చేస్తున్నారు. – సాలూరు రూరల్

ఇదే మా పాఠశాల..!

ఇదే మా పాఠశాల..!