
నేటి స్వాతంత్య్రం
నాటి పోరాట ఫలితం..
భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో సాలూరుకు చెందిన యోధులు అలుపెరగని పోరాటం చేశారు. వారిలో కూనిశెట్టి వెంకటనారాయణదొర, బెంజిమన్ ఫ్రాంక్లిన్, దారాముక్కల యగ్నేశ్వరశర్మ తదితరులు ఉన్నారు. కూనిశెట్టి వెంకటనారాయణ దొర వందేమాతర నినాదాలు వినిస్తూ బ్రిటిష్ వారి ఆగ్రహానికి గురయ్యారు. బరంపురం సి–క్లాసు జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమానికి ఈ ప్రాంతంలో నారాయణదొర నాయకత్వం వహించారు. స్వాతంత్య్రం వచ్చాక నారాయణదొరను స్థానికులు ఊరంతా గుర్రంపై ఊరేగించారు. సాలూరు గాంధీగా పిలుచుకున్నారు. సాలూరులో జాతీయజెండాను ఎగురవేసి భారత స్వాత్రంత్య సంగ్రామంలో సాలూరు ఖ్యాతిని ఆయన చాటి చెప్పారు. అనంతరం ప్రజాప్రతినిధిగా కొనసాగారు.