
సందడిగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
న్యూస్‌రీల్
–IIలో
పార్వతీపురంటౌన్: పార్వతీపురంలో 250 మీటర్ల జాతీయ జెండాతో ఆర్‌సీఎం పాఠశాల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన హర్‌ఘర్ తిరంగా ర్యాలీ దేశభక్తిని చాటింది. ర్యాలీలో కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగాలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మనందరం భరతమాత ముద్దుబిడ్డలమని, భరతమాత గర్వించేలా నడుచుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఇతర జిల్లా అధికారులు, వివిధ కళాశాలలు, పాఠశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సందడిగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

సందడిగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ