
●మహాత్ముని పిలుపుతో..
మహాత్మా గాంధీ పిలుపు మేరకు భామిని మండలం బత్తిలికి చెందిన దివంగత శాసనపురి వాసుదేవరావు దేశ స్వాతంత్య్రోద్యమంలో ఉత్సాహంగా పాల్గొ న్నారు. పార్వతీపురం కుట్ర కేసులో బ్రిటిష్ పోలీస్‌లు అరెస్టు చేసి ఆయనను జైలుకు పంపారు. సర్దార్ గౌతు లచ్చన్నలతో పాటు, కురుపాం చిన్నరాజు, పార్వతీపురానికి చెందిన వల్లూరు సాంబమూర్తి, వల్లభరావులతో కలిసి జైలు జీవితం అనుభవించారు. ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో మహాత్మా గాంధీ ప్రేరణతో విదేశీ వస్తువుల బహిష్కరిస్తూ స్వదేశీ ఉద్యమాన్ని చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చాక ఎమ్మెల్సీ పదవిని సైతం వాసుదేవరావు తిరిస్కరించారు. ఆయన 1994 జనవరి 2న తుది శ్వాస విడిచారు.