మెరుగైన వైద్యం అందించండి
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి వైద్యులకు సూచించారు. కురుపాం సీహెచ్‌సీను ఆమె శుక్రవారం రాత్రి పరిశీలించారు. తల్లీ పిల్లల వార్డులో ఒకే బెడ్‌పై జనరల్ పేషెంట్స్ ఇద్దరు, ముగ్గురికి వైద్యసేవలు అందించడంపై స్పందించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఆస్పత్రి భవనాన్ని ప్రారంభిస్తే రోగులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఓపీ ఎంత నమోదవుతుంది, కేసుల తీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
● మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి


