డీఎస్సీ అభ్యర్థుల నిరసన
విజయనగరం గంటస్తంభం: డీఎస్సీ అభ్యర్థులకు వయో పరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని, జిల్లాకు ఒకే పేపర్ విధానం ఉండాలని కోరుతూ డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్ ఆధ్వర్యంలో విజయనగరం కోట కూడలి వద్ద గురువారం ఆందోళన చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం సంవత్సరాల తరబడి నిరుద్యోగులు ఎదురుచూశారన్నారు. పరీక్షకు సిద్ధమయ్యేందుకు కనీసం 90 రోజులు సమయం లేకపోవడం ఆందోళనకు గురవుతున్నామన్నారు. వయోపరిమితి 44 సంవత్సరా లే కావడంతో చాలామంది వయో భారంతో అర్హత కోల్పోతున్నట్టు వెల్లడించారు. ఓపెన్ డిగ్రీలో పాస్ అయిన వారికి కూడా అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో రాము, భాను, ఈశ్వరరావు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.


