కదం తొక్కిన కూలీలు
చేసిన కష్టానికి ఫలితం దక్కదు. పని ప్రాంతంలో కనీస వసతులు ఉండవంటూ ఉపాధి వేతనదారులు..రాజకీయ ఒత్తిళ్లతో పని సక్రమంగా చేయలేకపోతున్నామని ఫీల్డ్ అసిస్టెంట్లు, తమకు పారితోషికం ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ ఉపాధి మేట్ల ఆగ్రహం పెల్లుబకడంతో అంతా కలిసి కలెక్టరేట్ వద్ద కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉపాధి పథకంలో పనిచేస్తున్న వేతనదారులు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లాకేంద్రంలో గురువారం కలెక్టరేట్ వద్ద వెళ్లగక్కిన ఆవేదన ఇలా ఉంది.
●12 వారాలుగా అందని
వేతనాలు
ఉపాధి వేతనదారులకు గడిచిన 12 వారాలుగా వేతనాలు చెల్లించడం లేదు. పనిజరిగే ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. వేసవికాలం దృష్ట్యా కల్పించాల్సిన సదుపాయాలు కానరావడం లే దు. ఒక పూట పని మాత్రమే చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
– బిడ్డిక సరోజ, ఉపాధి వేతనదారు,
కిల్లాడ గ్రామం, సీతంపేట మండలం
ఉద్యోగభద్రత కల్పించాలి
ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మేన్‌డేస్ విధానాన్ని రద్దుచేయాలి. రాజకీయ ఒత్తిళ్లతో విధుల నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి నియమించాలి. ప్రతి ఒక్కరినీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా గుర్తించి రూ. 26వేలు కనీస వేతనం అమలు చేయాలి. న్యాయమైన సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి.
– ఎ. జానకీరావు, ఫీల్డ్ అసిస్టెంట్,
పెద్దూరు గ్రామం, సీతంపేట మండలం
పార్వతీపురం టౌన్:
మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యలపై కదం తొ క్కారు. ఈ మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గురువారం నిరసన తెలి యజేశారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్‌కు తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఉపాధిహామీ పథకం ముఖ్య ఉద్దేశమైన గ్రామీణ పేదరిక నిర్మూలన, వలసల నివారణలో భాగంగా ఈ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. వేతనదారులకు గడిచిన 12వారాలుగా వేతనాలు చెల్లించకపోవడం అన్యాయమని ఉపాధివేతన దారులు వాపోయారు. వేసవికాలంలో పనుల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పనులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి మేట్లకు పారితోషికం ఇస్తామని చెప్పి నేటికీ చెల్లించకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని మండిపడ్డారు. కనీసం కూలీల వివరాలు నమోదు చేసేందుకు మేట్లకు మొబైల్ ఫోన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధిహమీ పథకంలో సమస్యలు పరిష్కరించి అందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనట్‌లైతే భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యం
గత 20 సంవత్సరాలుగా ఉపాధిహామీ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న తమపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫీల్డ్ అసిస్టెంట్లు మండిపడ్డారు. రాజకీయ ఒత్తిళ్లతో తమ పని తాము సరిగా నిర్వహించ లేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మేన్‌డేస్ విధానాన్ని రద్దుచేసి అందరికీ ఎఫ్‌టీఎఫ్ అమలు చేసి తమకు ఉద్యోగభద్రత కల్పించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లతో విధుల నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. కనీ స వేతనం రూ.26,000 చెల్లించి 19 సంవత్సరాల సర్వీసును గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమోట్ చేసే గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి అందరినీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించాల ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డి.రమణారావు, కార్యదర్శి వై.మన్మథరావు, అవుట్‌సోర్సింగ్ అండ్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా కన్వీనర్ బీవీ రమణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు, ఉపాధ్యక్షురాలు వి.ఇందిర, ఉపాధి వేతనదారులు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
పనులు చేయించుకుంటూ ఇవ్వని పారితోషికం
మేట్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. చేసిన పనికి పారితోషికం ఇస్తామ ని చెప్పి నేటికీ చెల్లించడం లేదు. కనీసం వేతనదారు ల వివరాలు నమోదు చేసేందుకు మొబైల్ ఫోన్లు ఇవ్వడం లేదు. గడిచిన 12 వారాలుగా వేతనాలు చెల్లించలేదు. ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే రానున్న రోజుల్లో భారీ ఉద్యమం చేపడతాం.
– అశ్విని, ఉపాధి మేట్, చినడోజ గ్రామం, జియ్యమ్మవలస మండలం
పదివారాలుగా అందని ఉపాధి వేతనాలు పనిప్రాంతాల్లో వసతులు కరువు
ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
మేట్లకు వేతనాలు చెల్లించాలి
కలెక్టరేట్ వద్ద వేతనదారులు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన
కదం తొక్కిన కూలీలు
కదం తొక్కిన కూలీలు
కదం తొక్కిన కూలీలు
కదం తొక్కిన కూలీలు
కదం తొక్కిన కూలీలు


