
రాజన్నదొరకు అభినందనల వెల్లువ
సాలూరు: వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ(పీఏసీ) సభ్యుడిగా నియమితులైన మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరకు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదివారం పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. సీనియర్ నాయకుడైన రాజన్నదొరకు కీలకమైన బాధ్యతలు అప్పగించడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఈ మేరకు పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు రాజన్నదొరను పట్టణంలోని ఆయన స్వగృహంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఎంతో నమ్మకంతో ఉంచిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. నాయకులు, కార్యకర్తలు, శ్రేణులతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. రాజన్నదొరను అభినందించిన వారిలో గిరి రఘు, మద్దిల గోవిందరావు, మొకర లక్ష్మణరావు, హరి ఈశ్వరరావు, సింగారపు ఈశ్వరరావు, సింహాచలం, బంకురు రామచంద్రరావు, మాదిరెడ్డి మధుసూదనరావు, మజ్జి అప్పారావు, జర్జాపు శ్రీనివాసరావు, పూడి కృష్ణచైతన్య తదితరులు ఉన్నారు.