● మీనాక్షి చౌదరి సామాజిక చైతన్యం
రాజాం: ప్రముఖ సినీ నటి, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ మీనాక్షి చౌదరి రాజాంలో శనివారం సందడి చేశారు. సీఎంఆర్ 18వ జ్యువెలరీ షోరూంను జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. షోరూంలో వెండి, బంగారు నగలను పరిశీలించారు. వాటిని అలంకరించుకుని మురిసిపోయారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎంఆర్ యాజమాన్యంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. ప్రజలకు నాణ్యతతో కూడిన జ్యువెలరీతో పాటు నూతన వస్త్రాలను సరసమైన ధరలకే అందిస్తూ సీఎంఆర్ ప్రజల ఆదరణ పొందుతోందన్నారు. రాజాంలో కొత్తగా ఏర్పాటుచేసిన షోరూంను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీఎంఆర్ డైరెక్టర్లు మావూరి వెంకటరమణ, మావూరి సత్యవీరసంతోష్‌మోహన్‌బాలాజీ, హారిక, ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, సీతారామ గ్రూప్ ఎండీ సి.వి.జగన్నాథస్వామి, వైద్యుడు ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు అంటే ఇష్టం
తెలుగు భాష అంటే చాలా ఇష్టమని, తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు ఎక్కువగా రావడం అదృష్టమని మీనాక్షి చౌదరి అన్నారు. ఆమెను చూసేందుకు వచ్చిన రాజాం ప్రజలతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇప్పటివరకు తెలుగుభాషలో 8 సినిమాల్లో నటించానన్నారు. వీటిలో లక్కీభాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు మంచి గుర్తింపునిచ్చాయన్నారు. త్వరలో నాగచైతన్యతో సినిమా తీస్తున్నట్టు వెల్లడించారు. డెంటల్ విభాగంలో వైద్యవిద్యను అభ్యసించానని, స్విమ్మింగ్, బ్యాండింటన్ క్రీడల్లో మంచి ప్రావీణ్యం ఉందని, ఆ క్రీడా పాత్రల్లో నటించాలని ఉందన్నారు.
రాజాంలో సీఎంఆర్ జ్యువెలరీ షాపింగ్‌మాల్‌ను ప్రారంభించిన అనంతరం మీనాక్షి చౌదరి తన సామాజిక సేవాభావాన్ని చాటుకున్నారు. చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, పోలీసులతో కలిసి డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించారు. వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి మత్తుపదార్థాలు, మాదక ద్రవ్యాలు వల్ల కలిగే అనర్థాలను వివరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర, ఎస్‌ఐ రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించే
వాల్‌పోస్టర్‌ను ప్రదర్శిస్తున్న మీనాక్షి చౌదరి
● సీఎంఆర్ జ్యువెలరీ షోరూం ప్రారంభం
● సీఎంఆర్ జ్యువెలరీ షోరూం ప్రారంభం