అచ్చంగా పచ్చ పోలీసు..! | - | Sakshi
Sakshi News home page

అచ్చంగా పచ్చ పోలీసు..!

Nov 20 2026 2:12 AM | Updated on Nov 20 2026 2:12 AM

● మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన అన్నపురెడ్డి సీతారావమ్మపై లాఠీతో తల మీద కొట్టి, కాలితో పొత్తి కడుపులో తన్నాడు. దీంతో ఆమె వైద్యశాలలో చికిత్స పొందుతుంది. ● అనంతవరంలో సర్పంచి అభ్యర్థిని అక్రమంగా అరెస్టు చేసి నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించాడు. అనంతవరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్‌ అభ్యర్థిని అరెస్టు చేయడంతో గ్రామస్తులు ఆందోళన చేస్తున్న సమయంలో మహిళలను కూడా చూడకుండా లాఠీచార్జీ చేసి, కిందకు తోసి పడవేశాడు. ● నామినేషన్‌ కేంద్రాల వద్ద టెంటులు వేసుకొని వందలాదిమంది టీడీపీకి కార్యకర్తలు, ఇతర ప్రాంతాలలోని గూండాలు తిష్ట వేసి కూర్చున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్వయంగా టీడీపీ నాయకులు, గుండాలు నామినేషన్‌ కేంద్రాలలోకి వెళ్లి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేసి వ్యక్తులను బయటకు లాగుతున్నా పట్టించుకోలేదు. యథేచ్ఛగా టీడీపీ నాయకులతో చెట్టపట్టాలు వేసుకొని వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు.

టీడీపీ నేతలకు క్రోసూరు ఎస్‌ఐ రవిబాబు గులాంగిరీ

ఎస్‌ఐ ముసుగులో ఉన్న ‘దేశం’ కార్యకర్త పంచాయతీ ఎన్నికల వేళ మహిళలపై లాఠీచార్జి వైఎస్సార్‌ సీపీ మహిళా కార్యకర్తను కాలితో తన్నిన వైనం ఎంపీటీసీ నామినేషన్ల సమయంలో సైతం దళిత నాయకుడిపై కాళ్లతో దాడి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలే టార్గెట్‌గా పనిచేస్తున్న క్రోసూరు ఎస్‌ఐ రవిబాబు

టాస్క్‌ఫోర్స్‌: ఆయన ఎస్‌ఐ ముసుగులో ఉన్న తెలుగుదేశం కార్యకర్త.. పచ్చ ఖాకీకి నిలువెత్తు నిదర్శనం.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలే టార్గెట్‌గా విధులు.. స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి గులాం ఈ రవి. పల్నాడు జిల్లా క్రోసూరు ఎస్‌ఐ పి.రవిబాబు ఖాకీ ముసుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ టీడీపీ నేతల మెప్పు కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, అక్రమ అరెస్టులు చేశారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో క్రోసూరు మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలు ఉంటే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ఎక్కడా నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నాడు.

పచ్చ ఎస్‌ఐ దాష్టీకాలకు ఉదాహరణలు..

నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళుతున్న మాజీ జెడ్పీటీసీ భర్త చిలక పెదబాబుపై దుర్భాషలాడుతూ కాలితో తన్నాడు. వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు ఉన్న గ్రామాల్లో నామినేషన్‌ దాఖలు చేస్తే అంతు చూస్తామంటూ బెదిరించాడు. పంచాయతీ ఎన్నికల నామినేషన్‌లో కూడా రవిబాబు తన ప్రతాపాన్ని చూపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement