జనసేన, టీడీపీ వర్గాల మధ్య తోపులాట | - | Sakshi
Sakshi News home page

జనసేన, టీడీపీ వర్గాల మధ్య తోపులాట

Nov 19 2026 2:49 AM | Updated on Nov 19 2026 2:49 AM

నూజెండ్ల: మండల పరిధిలోని కంభంపాడు నామినేషన్‌ కేంద్రం వద్ద జనసేన, టీడీపీ వర్గాలు ఘర్షణకు దిగిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామంలో సర్పంచి అభ్యర్థిత్వానికి ఇరువర్గాలు నామినేషన్‌లు వేశారు. సర్పంచి పదవికి జనసేన మద్దతు అభ్యర్థులు ఇద్దరు, టీడీపీ మద్దతు అభ్యర్థి ఒకరు నామినేషన్‌ వేశారు. అదే విధంగా పది వార్డులకు గాను ఆరు వార్డులకు జనసేన తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. అయితే సర్పంచి పదవికి జనసేన వేసిన రెండు నామినేషన్లు, ఆరు 6 వార్డు మెంబర్ల పదవులకు వేసి నామినేషన్లను ఆర్వో వివిధ కారణాలతో తిరస్కరించారు. దీంతో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి కొంజేటి నాగశ్రీను తన అనుచరులతో కలిసి రిటర్నింగ్‌ అధికారి కార్యాయానికి వెళ్లారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న టీడీపీ వర్గీయులు నాగశ్రీనును అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. తోపులాటకు దారితీసింది. టీడీపీ వర్గీయులు, తమపై దాడికి పాల్పడ్డారని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కూటమిలో భాగస్వాములుగా ఉంటూ ఇలా అడ్డుకోవటం సరికాదని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐనవోలు పోలీసులు సర్దిచెప్పారు. మండల ఎన్నికల అధికారి, ఎంపీడీఓ సత్యనారాయణను వివరణ కోరగా పత్రాల నమోదులో తప్పిదాల కారణంగా ఆర్వో నామినేషన్లు తిరస్కరించినట్లు చెప్పారు. ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement