దాచేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గెలుద్దామని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. స్థానిక తిరుమల కల్యాణ మండపంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. సర్పంచ్ ఎన్నికలు నేపథ్యంలో గ్రామాల వారిగా పార్టీ నాయకులతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్‌లు వేయకుండా అడ్డుకున్న పోలీసులే తప్పుడు కేసులు పెట్టడం విచిత్రంగా ఉందని అన్నారు. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రతి గ్రామం నుంచి సర్పంచ్‌గా, వార్డు సభ్యుడిగా తప్పనిసరిగా పోటీ చేయాలని, ఎవరైతే పోటీల్లో నిలిచి పార్టీని కాపాడతారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరిని కాపాడే బాధ్యత నాది అని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులందరు పోలీసులు, కూటమి నేతల బెదిరింపులకు భయపడవద్దని, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా నామినేషన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నామినేషన్ వేయకుండా అడ్డుకునే పరిస్థితులు ఉంటే తన దష్టికి తీసుకురావాలని, న్యాయస్థానంలో న్యాయపోరాటం చేసి నామినేషన్ వేసేలా తన వంతు చర్యలు తప్పకుండా తీసుకుంటానని అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు అభ్యర్థులకు అండగా నిలవాలని, పార్టీ పరంగా అండగా ఉంటామని చెప్పారు. సమావేశంలో పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్ సుభానీ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, నగర పంచాయతీ మాజీ చైర్మన్లు కొప్పుల సాంబయ్య, మునగా పున్నారావు, మాజీ సర్పంచ్ మందపాటి రమేష్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కొప్పుల రవికుమార్, నియోజకవర్గ అధికార ప్రతినిధి షేక్ జాకీర్ హుస్సేన్, నాయకులు తండా అబ్దుల్ సత్తార్, ఉల్లేరు హనుమంతరావు, కోలా జంపాలరెడ్డి, కూసం నాగిరెడ్డి, దేవళ్ల వీరాస్వామి, పరిమి బాబు, మేడతి నరసింహారావు, పసుపులేటి నరసింహారావు, కర్పూరపు వెంకటకోటయ్య, అరికట్ల మల్లారెడ్డి, కాసార్ల జానకిరెడ్డి ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి


