ఎన్నికల విధుల్లో సమస్యలు రాకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల్లో సమస్యలు రాకుండా చూడాలి

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

–జిల్లా కలెక్టర్‌ను కోరిన యూటీఎఫ్‌ నాయకులు

నరసరావుపేట: ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో విధులు నిర్వహణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ద్యూటీ కేటాయింపులో పలు సమస్యలు ఎదుర్కొన్నారని, ఆ సమస్యలు పంచాయతీ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్‌ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో డీఆర్‌ఓ కె.అద్దెయ్యకు వినతిపత్రం సమర్పించారు. జరగబోవు మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో ఉపాధ్యాయులకు నియోజకవర్గ పరిధిలో పక్క మండలాలకు డ్యూటీలు కేటాయించాలని, 60 ఏళ్లు పైబడిన వారికి వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి మినహాయించాలని, ఎన్నికల విధులు, కౌంటింగ్‌ డ్యూటీలలో పాల్గొనే సిబ్బందికి రెమ్యూనరేషన్‌ చెల్లింపులలో అసమానతలు సరిచేయాలని, కౌంటింగ్‌ కేంద్రాల్లో సరైన వసతులు కల్పించాలని, గజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు స్టేజ్‌–1, స్టేజ్‌–2 రెండు రకాల విధులకే కేటాయించాలని, ముఖ్యంగా మహిళా ప్రధానోపాధ్యాయులకు ఏదోఒక డ్యూటీ మినహాయించి నియోజకవర్గ పరిధిలో విధులు నిర్వహించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి మోహనరావు, జిల్లా కార్యదర్శి కె.తిరుపతి స్వామి, చిలకలూరిపేట పట్టణ కార్యదర్శి పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికలకు రెండోరోజు నామినేషన్లు

సర్పంచ్‌ పదవులకు 426, వార్డు మెంబర్లకు 1775 నామినేషన్లు దాఖలు

నరసరావుపేట: జిల్లాలో మొదటి దశలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో సోమవారం రెండోరోజున సర్పంచ్‌ పోస్టులకు 426, వార్డు మెంబర్లకు 1775 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి బి.నాగేశ్వరనాయక్‌ సోమవారం సాయంత్రం వెల్లడించారు. మొదటి రోజున సర్పంచ్‌ పదవులకు 173, వార్డు మెంబర్లకు 696 నామినేషన్లు దాఖలైన విషయం విదితమే. జిల్లాలోని నరసరావుపేట డివిజన్‌లో గల బొల్లాపల్లి, వినుకొండ, నరసరావుపేట, నూజెండ్ల, రొంపిచర్ల, శావల్యాపురం, ఈపూరు మండలాల్లోని 173 పంచాయతీ పదవులు, 1712 వార్డు మెంబర్లకు నామినేషన్లు జరుగుతున్నాయి. చివరిరోజు మంగళవారం కూడా నామినేషన్ల కార్యక్రమం జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement