నరసరావుపేట/నరసరావుపేట రూరల్: నరసరావుపేట మండలంలోని గోగులపాడు, కర్లకుంట గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాలకు అభ్యర్థులు వెళ్లకుండా గ్రామాల సరిహద్దుల్లోనే టీడీపీ గూండాలు అడుకున్నారు. టీడీపీకి చెందిన వారు నామినేషన్లు వేసుకునేందుకు అవకాశం ఇస్తున్నారు. రూరల్ మండలంలో కూటమి బలంగా ఉన్న జొన్నలగడ్డ, ఇస్సపాలెం, పమిడిపాడు, రావిపాడు, పాలపాడు, యల్లమంద, కొండకావూరు, కాకాని, కేసానుపల్లి గ్రామాలను నామినేషన్ కేంద్రాలుగా నిర్ణయించారు. నామినేషన్ తొలిరోజు జొన్నలగడ్డ మినహా మిగిలిన కేంద్రాలను పచ్చమూకలు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. కాకానిలోని నామినేషన్ కేంద్రంలో పెట్లూరివారిపాలెం సర్పంచి స్థానానికి నామినేషన్ వేసేందుకు వచ్చిన కందుకూరి వెంకాయమ్మపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. నామినేషన్ పత్రాలను చించివేశారు. అడ్డుకోబోయిన నాగయ్య అనే వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఇస్సపాలెంలో పోలీసులే నామినేషన్లను అడ్డుకున్నారు. ములకలూరు గ్రామస్తులు పోలీసులతో యుద్ధమే చేయాల్సి వచ్చింది. వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి షేక్ మస్తాన్‌బీతో పాటు వార్డు సభ్యులను అనుమతించలేదు. లాఠీచార్జ్ చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద కూటమి నాయకులు రౌడీ బ్యాచ్‌లను దించారు. పమిడిమర్రి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి గర్నెపూడి ముసలయ్య నామినేషన్ దాఖలు చేసేందుకు కోటప్పకొండలోని నామినేషన్ కేంద్రానికి రాగా, కూటమి వారు కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సర్పంచ్‌తోపాటు ఆరుగురు వార్డు అభర్థులు మాత్రమే నామినేషన్ వేశారు.


