వైఎస్సార్‌ సీపీ నాయకుల అక్రమ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నాయకుల అక్రమ అరెస్ట్‌

Nov 16 2026 2:38 AM | Updated on Nov 16 2026 2:38 AM

లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

నరసరావుపేట రూరల్‌: మండలంలోని పాలపాడుకు చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, మాజీ సర్పంచులు సైకం సత్యనారాయణరెడ్డి, కాణాల చెంచురెడ్డి, టీడీపీ అసమ్మతి నాయ కుడు అలవాల సాంబిరెడ్డిలను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్లు పురస్కరించుకుని వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులతో పాటు అసమ్మతి నాయకులు నామినేషన్‌ దాఖలు చేయకుండా అడ్డుకునేందుకే అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వీరిని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఏఎన్‌యూ(పెదకాకాని): దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం విద్యారంగంలో చేసిన మార్పులన్నీ పాలకవర్గాల ప్రయోజనం కోసమే జరిగాయని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆల్‌ యూనివర్సిటీస్‌ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నూతన లేబర్‌ కోడ్స్‌ విశ్వవిద్యాలయ ఉద్యోగులపై ప్రభావం అనే అంశంపై ఆదివారం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు యూనియన్‌ కార్యనిర్వహాక అధ్యక్షులు కె.భానుప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1966లో కొఠారి కమిషన్‌ దేశంలో ఉన్నత విద్య, సాంకేతిక విద్యతోపాటు అందరికీ విద్య అందాలంటే ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిఫార్సు చేసిందని, ఇంతవరకు కొఠారి కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలేదని విమర్శించారు. విశ్వవిద్యాలయాల్లో పర్మినెంట్‌ ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, డైలీవేజ్‌, క్యాజువల్‌, కంటింజెంట్‌ పేరుతో ఉద్యోగులు, కార్మికులను తీసుకొని వారికి ఎలాంటి హక్కులు లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ రద్దు చేసేందుకే లేబర్‌ కోడ్స్‌ తెచ్చారని, వాటికి వ్యతిరేకంగా ఐక్యమవ్యాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్‌ కోడ్‌లుగా మార్చారన్నారు. పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే ఈ లేబర్‌ కోడ్స్‌ తెచ్చారన్నారు. లేబర్‌ కోడ్స్‌కు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 1వ తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర క్యాదర్శి కె.ఉమామహేశ్వరరావు, యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెయస్‌ కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బి ముత్యాలరావు, ఏఎన్‌యూ టైం స్కేల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీనందేశ్వరరావు, నాయకులు పద్మ, తదితరులు ఉపన్యసించారు. కార్యక్రమంలో ఎన్‌.వెంకటేశ్వరరావు, సిహెచ్‌ గోపాలకృష్ణ, కోలా వెంకటేశ్వర్లు, అచ్చిబాబు, ఎన్‌.ప్రసాద్‌, వెంకట రమణ, నిరంజన్‌ కుమార్‌, మందా రాజేష్‌, సాంబశివరావు, శ్రీనివాసరావు, సుధీర్‌బాబు, వివిధ విశ్వవిద్యాలయాల ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

తెనాలిరూరల్‌: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలి రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగింది. పద్మావతి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ కింద పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న సమాచారంతో జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. మృతుడి ఆచూకీ తెలియలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్పీ ఎస్‌ఐ ఎల్‌.సరస్వతి ఆదివారం తెలిపారు.

బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు అన్నం పార్టీకి రాజీనామా

బాపట్ల: బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ ఆ పార్టీ పదవికి, సభ్యత్వానికి ఆదివారం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి లిఖిత పూర్వకంగా రాజీనామాను పంపారు. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా స్థానికేతరుడు ఇస్కా సునీల్‌కు పార్టీ టికెట్‌ కేటాయించటాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. పేర్లి సునీల్‌ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించి ప్రత్యేక ప్యానల్‌ను అన్నం సిద్ధం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement