ఐటీడీపీపై కఠిన చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి సత్తెనపల్లి పట్టణ పోలీస్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు
సత్తెనపల్లి: మహిళల ఆత్మగౌరవంపై ట్విట్టర్ వేదికగా (ఎక్స్) రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని అసభ్యకర, అవమానకర పదజాలంతో దాడి చేయడం హేయమైన చర్య అని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా వైఎస్సార్ సీపీ మహిళలపై అనుచిత పోస్టులపై సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ రాజశేఖర్‌కు లిఖిత పూర్వకంగా ఆదివారం ఫిర్యా దు అందించారు. ఆ పోస్టులను పెన్ డ్రైవ్‌లో కాపీ చేసి ఫిర్యాదుతో పాటు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సుధీర్‌భార్గవ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమాజంలో ఎవరైనా సంయమనం పాటించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం గురించి ఎక్కడా మా ట్లాడవద్దని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. ఆదేశాల మేరకు తమ పార్టీ శ్రేణులు ఎంతో సంయమనం పాటించారన్నారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిలతో పాటు సినీనటులు అల్లు అర్జున్ సతీమణి, జూనియర్ ఎన్టీఆర్ తల్లి, సతీమణులను నీచంగా మాట్లాడటం దారుణమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో వైఎస్సార్ సీపీ శ్రేణులు సంయమనం పాటించిన విషయాన్ని జీర్ణించుకోలేని ఐటీడీపీ వారు ఎలాగైనా హింసను ప్రేరేపించే విధంగా వైఎస్సార్ సీపీ మహిళలపై అసభ్యకరమైన పోస్టులను పెట్టారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత తిరుగు రశీదు అడిగితే ఇవ్వటం కుదరదని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ గీతహాసంతి, నాయకులు షేక్ మౌలాలి, చల్లంచర్ల సాంబశివరావు, కళ్ల విజయభాస్కరరెడ్డి, మర్రి వెంకటసుబ్బారెడ్డి, షేక్ మాబూహుస్సేన్, తుమ్మల వెంకటేశ్వరరావు, చిన్నం మణి బాబు, ఎం.ఏడుకొండలు, అంకాళ్ల వెంకటేశ్వర్లు, కొణతం స్వాతి, చిల్లంచెర్ల కళ్యాణ్, అచ్యుత శివప్రసాద్,గుజ్జర్లపూడి కృపావరం, గుంటూరు సుషీంద్ర కుమార్, సీఎన్‌ఆర్, గుజ్జర్లపూడి నిరంజన్ ప్రకాష్, మనికే మహేష్ పాల్గొన్నారు.


