అంత్యక్రియలకు హాజరై వస్తూ అనంతలోకాలకు... | - | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలకు హాజరై వస్తూ అనంతలోకాలకు...

Nov 15 2026 8:29 PM | Updated on Nov 15 2026 8:29 PM

ఆటోను ఢీకొన్న కారు ఒకరు మృతి.. ఏడుగురికి గాయాలు సుబ్బయ్యపాలెం జంక్షన్‌ వద్ద ఘటన

రొంపిచర్ల: మండలంలోని శ్రీ కాసు బ్రహ్మనందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌ హైవేపై సుబ్బయ్యపాలెం జంక్షన్‌ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే రోడ్డు క్రాస్‌ చేస్తున్న ఆటోను కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, ఫిరంగిపురం మండలం 113 తాళ్లూరుకు చెందిన వారు ఈపూరు మండలం గుండేపల్లి గ్రామంలో బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సుబ్బయ్యపాలెం జంక్షన్‌ వద్ద రోడ్డు దాటుతుండగా ఒంగోలు వైపు నుంచి వచ్చిన కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో ఆటో పక్కకు ఎగిరి పడటంతో ఆటోలోని ఏడుగురు బయటకు వచ్చి రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో గోపమ్మ(40) మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న రాయచోటికి చెందిన చందన అనే మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో నరసరావుపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ లోకేశ్వరరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement