రాష్ట్రస్థాయి సైన్స్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి సైన్స్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

Nov 14 2026 3:34 AM | Updated on Nov 14 2026 3:34 AM

రాష్ట్రస్థాయి సైన్స్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక నరసరావుపేట ఈస్ట్‌: మున్సిపల్‌ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా స్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు నిర్వహించారు. 32వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ను పురస్కరించుకొని పోటీలలో భాగంగా జిల్లా జట్టును ఎంపిక చేసారు. పల్నాడుజిల్లా పరిధిలోని వివిధ పాఠశాలల నుంచి 120 ప్రాజెక్ట్‌లు పోటీలో పాల్గొనగా వీటి నుంచి 7 ప్రాజెక్ట్‌లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసారు. ఎంపికై న ప్రాజెక్ట్‌లను బి.శ్రావణి (ఎస్‌బి పురం), సిహెచ్‌.సారూప్య (జడ్పీ హైస్కూల్‌, ఎన్‌ఎస్‌పీ కాలనీ, వినుకొండ), జి.లక్ష్మీనాగచైతన్య (జడ్పీ హైస్కూల్‌, చల్లగుండ్ల), ఎం.మౌనిక (జడ్పీ హైస్కూల్‌, దమ్మాలపాడు), టి.గౌతమ్‌ జడ్పీ హైస్కూల్‌ (ముత్యాలంపాడు), వి.పవన్‌కుమార్‌ (జడ్పీ హైస్కూల్‌, నాగులవరం), పి.పవన్‌కుమార్‌ (జడ్పీ హైస్కూల్‌, కొండలరాయునిపాలెం) రూపొందించారు. ఈసందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి పివిజే రామారావు ఎంపికై న విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ ఎస్‌.రాజశేఖర్‌, జిల్లా అకడమిక్‌ కోఆర్డినేటర్‌ సీతారామయ్య, ప్రధానోపాధ్యాయులు షేక్‌ మౌలాబీ, వీరప్పయ్య, జ్యూరీ సభ్యులు అప్పారావు, వెంకటేశ్వర్లు, అనిత, శివప్రియ, రామాంజమ్మ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుడిపై దాడి కేసులో ఇద్దరికి జరిమానా

పిడుగురాళ్ల: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిపై దాడి చేసిన కేసులో ఇద్దరు నిందితులకు జరిమానా విధిస్తూ పిడుగురాళ్ల పట్టణ జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి టి.ప్రవల్లిక తీర్పు చెప్పారు. సీఐ శ్రీరాం వెంకట్రావు తెలిపిన వివరాలు.. పిడుగురాళ్ల పట్టణం నెమలిరెడ్డి బజారులో చదలవాడ రమేష్‌, ఆయన భార్య రాజేశ్వరి జీవిస్తున్నారు. పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రమేష్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2022 మార్చి 14వ తేదీ మధ్యాహ్న సమయంలో టాబెట్ల కోసం ఇంటికి వచ్చాడు. తలుపు తట్టగా భార్య రాజేశ్వరి కొంత సమయం తర్వాత వచ్చి తలుపు తీసింది. రమేష్‌ వాష్‌రూమ్‌కు వెళ్లి వచ్చేసరికి గాదె తిరపతయ్య అలియాస్‌ గోపి హాలులో రాజేశ్వరితో చనువుగా మాట్లాడటం రమేష్‌ గమనించారు. వెంటనే నిలదీయగా గోపి పక్కనే ఉన్న కర్రతో రమేష్‌పై దాడి చేశాడు. రమేష్‌ చేతికి దెబ్బ తగిలింది. ఈ విషయమై ఆయన పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ పవన్‌కుమార్‌ కేసు నమోదు చేసి సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. నేరం రుజువు కావడంతో చదలవాడ రాజేశ్వరి, గాదె తిరుపతయ్యలకు న్యాయమూర్తి ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో నెల రోజులపాటు జైలు శిక్ష అనుభవించేలా తీర్పును వెలువరించినట్లు సీఐ శ్రీరాం వెంకట్రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement