సమన్వయంతో పనిచేస్తేనే ధరల నియంత్రణ | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పనిచేస్తేనే ధరల నియంత్రణ

Nov 14 2026 3:34 AM | Updated on Nov 14 2026 3:34 AM

జేసీ సంజనా శ్రీహర్ష ధరల నియంత్రణ కమిటీ సమావేశం

నరసరావుపేట: ధరల నియంత్రణలో వ్యాపారులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం ప్రకటించిన ధరలకే నిత్యావసరాలు విక్రయించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంజనా శ్రీహర్ష రైస్‌ మిల్లర్లు, రిటైలర్ల వ్యాపారులకు సూచించారు. కలెక్టర్‌ కార్యాలయంలో జేసీ అధ్యక్షతన శుక్రవారం ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ధరల నియంత్రణ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన బియ్యం రకాలను ప్రకటించిన ధరల ప్రకారమే విక్రయించాలని ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి ఎంవీ ప్రసాద్‌ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, వినియోగదారులకు సరసమైన ధరలకు సరుకులు విక్రయించటమే లక్ష్యంగా వ్యాపారులు నిబంధనలు పాటించాలని కోరారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అధ్యక్షుడు అత్తులూరి సుబ్బారావు మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం సేకరించే సమయంలోనే ధరలు అధికంగా ఉంటున్నాయన్నారు. దీని వలన మిల్లర్లు, రిటైలర్లకు అనుకూలమైన ధరలకు బియ్యం సరఫరా చేయలేకపోతున్నామన్నారు. వినియోగదారుల సంఘం జిల్లా నాయకులు పిల్లి యజ్ఞనారాయణ, మురికిపూడి ప్రసాద్‌ మాట్లాడుతూ వినియోగదారులకు సరసరమైన ధరలకు సరుకులు విక్రయించటం నైతిక బాధ్యత అన్నారు. బ్లాక్‌ మార్కెట్‌కు పాల్పడటం సమంజసం కాదని పేర్కొన్నారు. రైస్‌ మిల్లర్లు, రిటైలర్లు పేర్కొనే స్టాక్‌ రిజిస్టర్‌లో నమోదైన నిల్వలు, వాస్తవ నిల్వలకు మధ్య వ్యత్యాసాలు ఉండకూడదని చెప్పారు. చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం, కందిపప్పు, నూనె పంపిణీ చేసే సమయంలో స్టాకు ఉన్నా లేవని డీలర్లు చెబుతున్నారని కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. విజిలెన్స్‌ కమిటీలను క్రియాశీలకం చేసి చౌక ధరల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement