గుప్తా వలన జరిగిన అన్యాయాన్ని పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

గుప్తా వలన జరిగిన అన్యాయాన్ని పరిష్కరించండి

Nov 14 2026 3:34 AM | Updated on Nov 14 2026 3:34 AM

నరసరావుపేట: స్థానిక గడియార స్తంభం దగ్గర ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి గుడికి చెందిన భూమి వ్యవహారంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, ప్రస్తుతం టీడీపీ తరపున చైర్మన్‌ సీటు ఆశిస్తున్న నాగసరపు సుబ్బరాయగుప్తా కుటుంబం వల్ల తమకు జరిగిన అన్యాయాన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు బాధితురాలు దుర్గా పార్వతి పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఎన్నికల అనంతరం మీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానని, ఎన్నికల తర్వాత మళ్లీ తనను కలవాలని కోరినట్లు బాధితురాలు తెలియజేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ గడియార స్తంభం దగ్గర పట్టాభిరామస్వామి గుడి భూమితో పాటు, తమకు చెందిన భూమిని కూడా కలిపేసి, అక్కడ నిర్మాణం చేపట్టారన్నారు. దాని పక్కనే ఉన్న తమ ఇంటిని కూల్చి దౌర్జన్యం చేశారని, వారసుల్లో ఒకడైన తమ సోదరుడు గుప్తా కుటుంబ సభ్యులతో కుమ్మకై ్క తమ ఆస్తిని వారికి సొంతం చేశాడన్నారు. దీనికి మేము వ్యతిరేకిస్తే, మా ముగ్గురు అక్కచెల్లెళ్లపై గుప్తా కుటుంబం దౌర్జన్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మా భూమి మాకు స్వాధీనం చేయాలని పార్వతి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement