నరసరావుపేట రూరల్: ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పిస్తున్నట్టు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి తెలిపారు. పంచాయతీ మొదటి దశ, నరసరావుపేట మున్సిపాలిటి ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ సమయలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. నామినేషన్ల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి, డీఎస్పీ, సీఐలు పాల్గొన్నారు.


