● నామినేషన్ ప్రక్రియలో పలు పత్రాలు కీలకం
● పక్కాగా ఉంటేనే నామినేషన్‌కు ఆమోదం ● అభ్యర్థికి కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి.
● గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో స్థానికంగా పేరు ఉండాలి.
● ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు.
● కాగా, నామినేషన్‌ను ప్రతిపాదించే వ్యక్తి అదే గ్రామ పంచాయతీ ఓటరై ఉండాలి. అభ్యర్థి స్వయంగా లేదా ప్రతిపాదకుడి ద్వారా నామినేషన్ దాఖలు చేయవచ్చు.
● నామినేషన్ ఫారం: రిటర్నింగ్ అధికారి వద్ద ఫారం–3 తీసుకుని పూర్తి చేయాలి. అభ్యర్థి, ప్రతిపాదకుడి సంతకాలతో సమర్పించాలి.
● ఓటరు గుర్తింపు: ఓటరు కార్డు జిరాక్స్ కాపీపై అభ్యర్థి, ప్రతిపాదకుడి సంతకాలు ఉండాలి.
● ఆధార్ కార్డు: ఆధార్ జిరాక్స్ కాపీ జత చేయాలి.
● ఫొటోలు: నాలుగు నుంచి ఆరు పాస్‌పోర్టు సైజు ఫొటోలు సిద్ధం చేసుకోవాలి.
● వయసు ధ్రువీకరణ: పదో తరగతి మార్కుల జాబితా లేదా జనన ధ్రువపత్రం సమర్పించాలి.
● కుల ధ్రువీకరణ: రిజర్వుడ్ స్థానంలో పోటీ చేసేవారికి ఇది తప్పనిసరి. జనరల్ స్థానంలో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు డిపాజిట్ రాయితీ కోసం కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.
● నో డ్యూ సర్టిఫికెట్: గ్రామ పంచాయతీకి ఎలాంటి బకాయిలు లేవని పంచాయతీ కార్యదర్శి నుంచి ధ్రువీకరణ పొందాలి. విద్యుత్ బిల్లులు, బ్యాంకుల్లోని పాత అప్పులను చెల్లించాలి లేదా వడ్డీ కట్టి రెన్యువల్ చేయించి అప్పులు లేనట్లు ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి.
● అఫిడవిట్: నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, పిల్లల వివరాలతో ఇద్దరు సాక్షుల సంతకాలతో కూడిన ప్రమాణపత్రాన్ని సమర్పించాలి.
● డిపాజిట్ రసీదు: జనరల్ అభ్యర్థులు రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,500 చెల్లించాలి.
యడ్లపాడు: పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, నగర పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఇప్పటికే ముగిశాయి. చివరిగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది. సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు శుక్రవారం తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 16న రెండో విడత, 19న మూడో విడత నోటిఫికేషన్ రానుంది. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవాలనుకుంటున్న ఆశావహులు పావులు కదుపుతున్నారు. పోటీకి సిద్ధమవడమే కాదు.. నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలన్నీ ముందుగానే సమకూర్చుకోవడం కీలకం.
సర్పంచ్ అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు...
అవసరమైన పత్రాలివే..
ఒకటికి మించి నామినేషన్లు వేయవచ్చా?
ఒక అభ్యర్థి ఒకటి నుంచి నాలుగు సెట్ల వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఒక సెట్లో ఏదైనా పొరపాటు జరిగినా మరో సెట్ పరిశీలనకు వచ్చేలా దాఖలు చేసుకోవచ్చు. అవసరమైన ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఫారంలో వివరాలు, సంతకాలు, జతపరిచిన పత్రాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. ఎన్నికల నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి సూచించే తాజా పత్రాల జాబితాను కూడా నిర్ధారించుకోవాలి.